Call Money activities by the blessing of chandrababu Naidu

Call money activities by the blessing of chandrababu naidu

AP, Jagan, Assembly, Chandrababu, Call Money, Call Money case, Jagan on Call Money, Roja

Call Money activities by the blessing of chandrababu Naidu. AP opposition leader jaganMohanReddy slams Chandrababu Naidu on call money.

చంద్రబాబు ఆశిస్సులతో కాల్ మనీ ఆగడాలు

Posted: 12/23/2015 01:52 PM IST
Call money activities by the blessing of chandrababu naidu

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు మీద ప్రతిపక్ష నాయకుడు జగన్ మరోసారి విరుచుకుపడ్డారు. అసెంబ్లీని కేవలం ఐదు రోజులు మాత్రమే నడిపించి.. ప్రజా సమస్యల మీద చర్చించకుండా చేశారని మండిపడ్డారు. ప్రజా సమస్యల మీద ప్రభుత్వం చర్చించడానికి అవకాశం ఇవ్వడం లేదని జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో సంచలనం రేపిన కాల్ మనీ, సెక్స్ రాకెట్ కు చంద్రబాబు నాయుడు ఆశిస్సులు ఉన్నాయని జగన్ ఆరోపించారు. అసలు అసెంబ్లీ సమావేశాల్లో అంబేద్కర్ అంశం లేనే లేదని.. కావాలనే రాజకీయాల కోసం అంబేద్కర్ ను వాడుకున్నారని మండిపడ్డారు. ఏ ప్రజా సమస్య చర్చకు రాకుండా అసెంబ్లీ సాగిందని కూడా జగన్ అన్నారు.

చంద్రబాబు ఫిర్యాదు చేశారని ఎమ్మెల్యే రోజాను రూల్ 340 ప్రకారం సస్పెండ్ చేస్తున్నామని స్పీకర్ చెప్పారని జగన్ వెల్లడించారు.  కేవలం రోజాను మాత్రమే టార్గెట్ చేసి సంవత్సరం పాటు సస్పెన్షన్ వేటు వేశారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోజాను సస్పెండ్ చేశారని.. చర్చను దారి మళ్లించేందుకే ఇలా చేశారని అన్నారు. ఏడాది పాటు రోజాను సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు లేదని జగన్ తెలిపారు.  ఇక చర్చ లేకుండానే సభలో బిల్లు పెట్టడం... ఆమోదించడం జరిగిందని అన్నారు.  బిల్లులపై చర్చలు జరిగితే ప్రజా ఆమోదం తెలుస్తుందని.. ప్రతిపక్షం లేకుండానే 8 బిల్లులను ఆమోదించేశారని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Jagan  Assembly  Chandrababu  Call Money  Call Money case  Jagan on Call Money  Roja  

Other Articles