Ram Jethmalani said he is confident about cornering Arun Jaitley: AAP

Jaitley made a big mistake by suing kejriwal says jethmalani

ddca, ddca row, ddca scam, arun jaitley, aap, arvind kejriwal, ddca probe, ram jethmalani, lawyer ram jethmalani, Lal Kishan Advani, Jaitley Defamation Suit, DDCA Case, aap latest news, delhi news

Jethmalani had met Kejriwal in connection with the case and agreed to appear for the defendants, including senior party leaders Sanjay Singh, Ashutosh, Kumar Vishwas, Raghav Chadha and Deepak Bajpai.

ఆయన ఎలా భయటపడ్డారో.. ఈయన అలానే భాదపడతారు

Posted: 12/23/2015 01:00 PM IST
Jaitley made a big mistake by suing kejriwal says jethmalani

హవాలా కేసు నుంచి బీజేపీ కురువృద్దుడు, సీనియర్ నేత లాల్ కిషన్ అద్వానీ తన వల్లే బయటపడ్డారని ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ అన్నారు. కేజ్రీవాల్ పై పరువునష్టం దావా కేసులో అరుణ్ జైట్లీని తాను ప్రాసిక్యూట్ చేయనున్నానని తెలిపారు. 'హవాలా కేసులో అద్వానీ తరపున రాంజెఠ్మలానీ వాదించాడు. కానీ ఇప్పుడు అరుణ్ జైట్లీని నేను ప్రాసిక్యూట్ చేయనున్నాను. ఇది మీరు తెలుసుకోవాలి' అని జెఠ్మలానీ అన్నారు. హవాలా కేసు నుంచి అద్వానీ బయటిపడినట్టుగానే ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిధుల దుర్వినియోగం ఆరోపణల నుంచి జైట్లీ నిష్కళంకంగా బయటపడతారని ప్రధాని మోదీ పేర్కొన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

జైట్లీని ఇష్టపడను అన్న విషయం రహస్యంగా ఉంచడానికి తాను ప్రయత్నించనని చెప్పారు. ఈ కేసును దూరంగా ఉండాలని బీజేపీ కోరితేనని ప్రశ్నించగా... జైట్లీ, ఆయన కోటరీ కారణంగానే తాను బీజేపీ నుంచి బహిష్కణకు గురైయ్యానని ఆయన తన అవేదనను వ్యక్తం చేశారు. అయినప్పటికీ నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి కృషి చేశానని సమాధానమిచ్చారు. డీడీసీఏ వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై జైట్లీ పరువునష్టం దావా వేసి తప్పు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కేసులో విచారణ కమిటీ వేసే అధికారం ఢిల్లీ ప్రభుత్వానికి ఉందని రాంజఠ్మలానీ స్పష్టం చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Jethmalani  Lal Kishan Advani  Jaitley Defamation Suit  DDCA Case  

Other Articles