Sonia Gandhi fired on modi govt

Sonia gandhi fired on modi govt

National Herald, Sonia Gandhi, Rahul Gandhi, national Herald case, Modi, Congress, Patiyala Court, Bail to Gandhis

AICC President Sonia gandhi slams Modi and his govt. Congress leaders said that Modi govt dragged Sonia and Rahul handhi.

ఇదంతా కక్షసాధింపే: సోనియాగాంధీ

Posted: 12/19/2015 04:29 PM IST
Sonia gandhi fired on modi govt

బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ధైర్యంగా ఎదుర్కొంటామని తెలిపారు. అవినీతిపై పోరాటం సాగుతుందని రాహుల్ గాంధీ అన్నారు. నేషనల్ హెరాలడ్ కేసులో నిజాలు బయటకు వస్తాయని, న్యాయమే గెలుస్తుందని సోనియాగాంధీ అన్నారు. అధికార పార్టీ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వత్తిడులకు లొంగబోమని రాహుల్ అన్నారు. ప్రజల పక్షమే.. కాంగ్రెస్ అని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. ఒత్తిడులతో ప్రతిపక్షాలను బలహీన పరచలేరని పేర్కొన్నారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, మరో నలుగురు నిందితులకు బెయిలు మంజూరయింది. 50 వేల పూచీకత్తుతో పాటియాలా హౌజ్ లోని మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ ఇచ్చింది. సోనియాగాంధీకి ఎకె ఆంటోనీ, రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీ పూచీకత్తు ఇచ్చారు. ఈ కేసులో ఆస్కార్ ఫెర్నాండజ్ కు గులాంనబీ అజాద్, మోతీలాల్ ఓరాకు అజయ్ మాకన్ , సుమన్ దూబేకు మల్లికార్జున్ ఖర్గే పూచీకత్తు ఇచ్చారు. శామ్ పిత్రోడా అనారోగ్యం కారణంగా కోర్టుకు హాజరు కాలేదు. వారికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను మెజిస్ట్రేట్ 2016 ఫిబ్రవరి 20కి వాయిదా వేశారు. కపిల్ సిబల్ సోనియా, రాహుల్ ఇతరుల తరుపున కోర్టులో వాదనలు చేశారు. కోర్టు ఎలాంటి షరతులు విధించలేదని కపిల్ సిబల్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles