Court granted bail to Sonia and Rahul Gandhi

Court granted bail to sonia and rahul gandhi

Congress, National Herald, Sonia gandhi, Rahul Gandhi, Subrahmanya Swamy, Priyanka Gandhi

In National Herald case, Patiyala court granted bail to Sonia Gandhi and Rahul Gandhi. Within minutes of the proceeding, Congress President Sonia and Rahul Gandhi have been granted bail in the National Herald case.

సోనియా, రాహుల్ లకు బెయిల్ మంజూరు

Posted: 12/19/2015 03:16 PM IST
Court granted bail to sonia and rahul gandhi

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసిసి వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ హాజరయ్యారు. అయితే కోర్ట్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా తదితరులు మాజరయ్యారు. అయితే పాటియాలా కోర్టుకు వచ్చిన కాంగ్రెస్ మహామహులకు అక్కడి భద్రతా సిబ్బంది పూర్తి రక్షణకు కల్పించారు. అయితే రాహుల్ గాంధీతో సహా సోనియాగాంధీకి పటియాలా కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఒక్కొక్కరికి యాభై వేల పూచీకత్తుతో కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్డీయే ప్రభుత్వం కావాలనే తమను వేధిస్తున్నారని కాంగ్రెస్ అధినేత్రి ఆరోపించింది. కాగా దీన్ని కాంగ్రెస్ కు మైలేజ్ వచ్చేలా రాహుల్, సోనియాగాంధీలు పావులు కదిపారు.

అయితే నేషనల్ హెరాల్డ్ కేసులో నేడు కోర్ట్ కు హాజరైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీల్లో ఎవరూ కూడా ఏమీ మాట్లాడలేదు. అయితే వారి తరఫున కపిల్ సిబిల్ వాదించారు. పటియాలా కోర్ట్ నుండి బెయిల్ మంజూరైన తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయారు. సోనియాగాంధీ కుటుంబం, గులాం నబీ ఆజాద్, షీలా దీక్షిత్, అంబికా సోనీ, మీరా కుమార్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు పాటియాలా కోర్ట్ కు చేరుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విషయం తప్పు చేయనప్పుడు రాహుల్ గాంధీకి భయమెందుకు అని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమే. కాంగ్రెస్‌కు కూడా పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు. కదా? వారితో వాదనలు వినిపించొచ్చు. భయమెందుకు అని అడిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  National Herald  Sonia gandhi  Rahul Gandhi  Subrahmanya Swamy  Priyanka Gandhi  

Other Articles