terror activist reveals he had recce in tirumala for a terror outfit

He did recce in tirumala for a terror outfit

Subash Ramachandran, recce, tirumala, tirupati, odisha, nia, chennai, tirunelveli, mumbai, police, Terrorists, Police, Tirumala. cctv footage,

They caught him in a case relating to burning down of train bogies. But interrogation by Odisha police revealed that Subash Ramachandran (30), a native of Tamil Nadu, also performed a reconnaissance

తిరుమల శ్రీవారి ఆలయంలో రెక్కీ నిర్వహించిన ఉగ్రవాదులు

Posted: 12/17/2015 03:56 PM IST
He did recce in tirumala for a terror outfit

ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలను ముష్కర మూకలు టార్గెట్ చేశాయా..? అందుకోసం ఇప్పటికే రెక్కీ సైతం నిర్వహించాయా? ఔననే అంటున్నాయి నిఘా వర్గాలు. తిరుమలపై గురిపెట్టిన ముంబైకి చెందిన ఓ ఉగ్రవాద సంస్థ తమిళనాడుకు చెందిన రామచంద్రన్ అనే వ్యక్తి ద్వారా రెక్కీ చేయించింది. రైలు బోగీల దహనం కేసులో ఒడిశా పోలీసులు అతడిని అరెస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తిరుమలలో సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించిన నిఘా వర్గాలు.. రామచంద్రన్ రెక్కీ చేసిన అంశాన్ని నిర్ధారించాయి కూడా. దీంతో అప్రమత్తమైన ఇంటెలిజెన్స్, పోలీసు వర్గాలు తిరుమలతో పాటు అన్ని పుణ్యక్షేత్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి.

తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన సుభాష్ రామచంద్రన్ (30) చెన్నైకి వలస వచ్చి అక్కడ ఓ టీస్టాల్ ఏర్పాటు చేసుకున్నాడు. అది లాభసాటిగా లేకపోవడంతో దొంగతనాలకు పాల్పడ్డాడు. అక్కడి నుంచి దేశవ్యాప్తంగా పలు పట్టణాలకు వెళ్లి.. హోటళ్లలో పనిచేశాడు. 2013లో ముంబైలో స్థిరపడగా, అక్కడ రియాజ్ అనే వ్యక్తితో రామచంద్రన్‌కు పరిచయం ఏర్పడింది. అతనితోపాటు ఉత్తమ్, గోపాల్, అషప్ర్ కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి అప్పుడప్పుడు వచ్చి రామచంద్రన్‌ను కలుస్తుండేవారు. ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన వీరంతా గుర్తు తెలియని రసాయనంతో రైళ్లలో మంటలు రేపడానికి కుట్రపన్నారు. తిరుమలనూ టార్గెట్ చేసుకున్నారు. తాము వినియోగించే రసాయనాలను ప్రయోగించి చూడడానికి, తిరుమలలో రెక్కీ చేయడానికి రామచంద్రన్‌తో ఒప్పందం కుదుర్చుకుని అతడి అకౌంట్ లోకి రూ. 3 లక్షలు డిపాజిట్ సైతం చేశారు.

పూరీ రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించిన రైల్వే పోలీసులు అదే రోజు రామచంద్రన్‌ను పట్టుకున్నారు. అతడిని విచారించగా... అసలు విషయం బయటపడింది. దీంతో ఒడిశా ప్రభుత్వం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించాలని కేంద్ర హోంశాఖను కోరింది. ఈ మేరకు రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ అధికారులు.. రామచంద్రన్‌ను విచారించగా తిరుమలలో రెక్కీ చేసినట్లు వెల్లడైంది. ఈ విషయాలను తిరుమల నిఘావర్గాలు కూడా నిర్థారించాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయ.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Subash Ramachandran  terrorists recce  tirumala  tirupati  

Other Articles