Rapes are common phenomenon, happened during Ram Rajya too: UP top cop Jagmohan Yadav

Rapes took place during ram rajya too up top cop

DGP Jagmohan Yadav, Rapes are common, rapes happened in ram rajya, UP top cop Jagmohan Yadav, Jagmohan Yadav, UP DGP, Rape shocker, DGP controversy,

Uttar Pradesh Police Director General Jagmohan Yadav courted controversy by saying that "rapes were committed even during the Ram Rajya".

రామరాజ్యంలో అత్యాచారాలా..? డీజీపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 12/16/2015 11:34 AM IST
Rapes took place during ram rajya too up top cop

ఆయన ఓ పోలీసు బాసు.. తప్పు చేసిన పోలీసుల మీద..  తప్పుడు వ్యాఖ్యలు చేసిన వాళ్ల మీద చర్యలు తీసుకొని.. తప్పుదిద్దాల్సిన స్థాయిలో వున్న వ్యక్తి. రాష్ట్ర ప్రజలు శాంతిభద్రతలను, అటు మహిళలు యువతులకు మీకు అండగా పోలీసులు వున్నారు. మీకేం కాదు.. ధైర్యంగా అర్థరాత్రైనా ఒంటరిగా తిరగవచ్చ.. అంటూ భరోసా కల్పించాల్సిన అధికారి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా ఈయనగారు రామరాజ్యంలోకి టైమ్ మిషన్ లో వెళ్లి చూసివచ్చినట్లుగా వివానికి తెర తీశారు. తన విధులను తాను సక్రమంగా నిర్వహించలేని ఓ అధికారి తన తప్పులను, తన శాఖ తప్పులను కప్పిపుచ్చుకునే పనిలో భాగంగా చేసే అసందర్భ ప్రేలాపణలను ఈ అధికారి వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నాయి.

నేరాలకు పుట్టినిల్లులా మారిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర డీజీపీ జగ్మోహన్ యాదవ్ అత్యాచారాలు సర్వ సాధారణమని, రామ రాజ్యంలోనూ బలాత్కారాలు జరిగాయని వివాదాస్పద వ్యాఖ్య చేశారు.  మరో నెలలో పదవీ విరమణ చేయనున్న జగ్మోహన్ యాదవ్ నిన్న జరిగిన మీడియా సమావేశంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాక అత్యాచారాలపై తనను ప్రశ్నించిన ఓ విలేకరిని తన గదిలోకి వస్తే సవివరంగా సమాధానమిస్తానని చెప్పి ఆయన మీడియాకు షాకిచ్చారు. జగ్మోహన్ యాదవ్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదూర్ పాఠక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సాక్షాత్తూ డిజిపి స్థాయి అధికారే ఇలా మాట్లాడితే మామూలు వ్యక్తులు ఎలా వ్యవహరిస్తారని విశ్లేషకులు మండిపడుతున్నారు. డిజిపి వ్యాఖ్యలు అత్యాచార బాధితులను సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. మరి డిజిపి గారి మాటల మీద ఎంత దుమారం రేగుతుందో చూడాలి. 

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagmohan Yadav  UP DGP  Rape shocker  

Other Articles