ఒక్కడైన మైనారిటీగా వున్న వర్గం ఒక జట్టుగా ఏర్పడి.. వారి సంక్షేమాన్ని, అభివృద్దిని ఆ జట్టు తొడ్పడుతుందని ఆశిస్తుంటారు. అనేక మంది ఈ మేరకు సంక్షేమ సంఘాలను కూడా స్థాపించి వారి శ్రేయస్సుకు ఎలాంటి డోకా లేకుండా చూసుకుంటారు. భారతీయులు కూడా పలు దేశాలలో సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేసుకున్న ఉదాహరణలను మనం అనేకం చూస్తూనేవున్నాం. అయితే మెజరిటీగా వున్నవారు కూడా ఇలా సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేయడం మాత్రం అరుదుగా జరిగే విషయం. ఇలాంటిదే ఇప్పుడు జరిగింది.
పురుషాధిక్య సమాజంలో పురుషులకే భద్రత కరువైంది. పలువురు స్త్రీల కారణంగా మగవాళ్లు నిత్యం వేదనను అనుభవిస్తున్నారని భార్య బాధితుల సంఘం ఏర్పాటైన విషయం తెలిసిందే. మహిళల దినోత్సవాలు, మదర్స్ డే, బాలికల హక్కుల దినోత్సం తరహాలో ఫాదర్స్ డే, బాలల హక్కుల మాసోత్సవం ఇత్యాదులు నిర్వహించాలని ఇందుకు గాను ఓ క్యాలెండర్ ను రూపోందించారు. దాని పేరు మేలెండర్. దీని ప్రత్యేకత ఏమిటంటే, పురుషుల కోసం ప్రత్యేకంగా ఉండే దినోత్సవాల వివరాలతో దీనిని రూపొందించడమే. ముంబయికి చెందిన వాస్తవ్ ఆర్గనైజేషన్ అనే ఒక ఎన్జీవో సంస్థ పురుషుల హక్కుల కోసం పాటుపడుతోంది.
ఈ నేపథ్యంలోనే ఈ క్యాలెండర్ ను తయారు చేసింది. పురుషుల దినోత్సవం, పితృ దినోత్సవం, బాలుర దినోత్సవం.. ఇట్లీ అన్నీ పురుషులకు సంబంధించిన దినోత్సవాల తేదీలను ప్రత్యేకంగా పేర్కొంది. ఈ సందర్భంగా సదరు సంస్థ అధ్యక్షుడు అమిత్ దేశ్ పాండే మాట్లాడుతూ, పురుషుల దినోత్సవాల గురించిన అవగాహన కోసమే దీనిని తయారు చేశామన్నారు. సుమారు రెండు వేల క్యాలెండర్ల వరకు ముద్రించామని, ముఖ్యమైన మెట్రో నగరాల్లో మేలెండర్లను పంపిణీ చేశామని పాండే వెల్లడించారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more