DD News ahead of pvt English news channels in prime

Dd news ahead of pvt english news channels in prime

DD News, DD News Channel, DD News in Prime Time, Private News Channels

Public broadcaster Doordarshan News has a far greater share of viewership during evening prime time than private English news channels as per the latest Broadcast Audience Research Council (BARC) measurement data, officials claimed. A senior Doordarshan official said that the latest BARC ratings show that the DD News Prime Time (9-10 PM) programme 'News Night' during weekdays is the most-watched news programme for that slot among all English news channels.time

న్యూస్ లో టాప్.. డిడి న్యూస్

Posted: 12/14/2015 08:10 AM IST
Dd news ahead of pvt english news channels in prime

డిడి న్యూస్ అంటే అందరికి తెలుసు.. ఎలాంటి కమర్షియల్ వ్యాల్యూస్ లేకుండా క్వాలిటీ న్యూస్ అందిస్తుంది డిడి ఛానల్. తాజాగా ప్రైమ్ టైంలో ప్రైవేట్ ఇంగ్లిష్ చానళ్లు ప్రసారం చేసే న్యూస్ కంటే.. దూరదర్శన్ ప్రసారం చేసే వార్తలకు వీక్షకుల నుంచి ఎక్కువ ఆదరణ లభిస్తున్నట్టు బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) అధ్యయనంలో తేలింది. న్యూస్ నైట్ పేరుతో రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య ప్రసారం చేసే డీడీ న్యూస్ ప్రైమ్‌టైమ్‌ను అత్యధిక సంఖ్యలో వీక్షకులు చూస్తున్నారనే విషయం బార్క్ అధ్యయనంలో స్పష్టమైందని డీడీ న్యూస్‌కు చెందిన సీనియర్ కన్సల్టింగ్ ఎడిటర్ కేజీ సురేశ్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల వీక్షకుల డాటా, డీడీ ప్రసారం చేసే కార్యక్రమాలకు వీక్షకుల నుంచి లభిస్తున్న స్పందనకు సంబంధించిన గణాంకాలను బార్క్ వెల్లడించిందని, అందులో డీడీ న్యూస్‌కు మెరుగైన రేటింగ్ లభించిందని ఆయన తెలిపారు.

ప్రతి విషయంపై అనవసరపు రాద్ధాంతం చేయడం, సెన్సేషనలిజమే లక్ష్యంగా వార్తలను ప్రసారం చేయడం లాంటి అంశాలకు డీడీ న్యూస్ వ్యతిరేకమని ఆయన అన్నారు. డీడీ న్యూస్, ఇంగ్లిష్ న్యూస్ చానళ్ల కంటే హిందీ చానళ్లు అగ్రస్థానంలో కొనసాగుతున్నాయనే విషయం బార్క్ నిర్వహించిన వీక్షకుల సర్వేలో తెలిసిందని ఆయన పేర్కొన్నారు. ఉదయం పూట ప్రసారమయ్యే నయా సవేరాకు కొత్త రూపు కల్పిస్తున్నామని, ఆ కార్యక్రమం వీక్షకులను ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని సురేశ్ వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DD News  DD News Channel  DD News in Prime Time  Private News Channels  

Other Articles