10 lakh private vehicles in Delhi to go off roads daily

10 lakh private vehicles in delhi to go off roads daily

delhi, Pollution, Odd-Even formula, Kejriwal, Pollution control, Delhi Roads

Nearly 10 lakh private cars will daily stay off the roads in the national capital once the odd- even formula is enforced from January 1, with the drastic reduction in traffic flow expected to significantly reduce the high-level of pollution in the city. There are over 19 lakh private four-wheelers registered in Delhi and nearly half of these will go off the roads with the implementation of AAP government's ambitious odd-even formula.

పది లక్షల కార్లు రోడ్డెక్కవు... ఎందుకంటే

Posted: 12/14/2015 08:07 AM IST
10 lakh private vehicles in delhi to go off roads daily

అవును.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది లక్షల కార్లు రేడ్డెక్కడం లేదు. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కాలుష్య నియంత్రణలో భాగంగా తీసుకున్న కొత్త నిర్ణయం వల్ల. అయితే అది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు లెండి.. దిల్లీలో. వాతావరణ కాలుష్య నియంత్రణకు ఢిల్లీ సర్కారు చేపట్టనున్న సరి-బేసి విధానంతో రోజూ పదిలక్షల కార్లు ఇండ్లకే పరిమితం కానున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 19లక్షల ప్రైవేటు కార్లు, జీపులు, వ్యాన్లు రిజిస్టర్ అయినట్లు అధికారులు చెప్తున్నారు. సరి-బేసి విధానంతో వాహనాలు సగం మాత్రమే రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉంటుంది.

ఈ విధానం జనవరి 1వ తేదీనుంచి అమల్లోకి రానున్నదని.. ఈ నిర్ణయంతో వాతావరణ కాలుష్యంతోపాటు ట్రాఫిక్ సమస్యలు కూడా భారీగా తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు. రవాణాకు ఇబ్బందులు కలుగకుండా ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా 10వేల ఆటోలకు అనుమతి ఇవ్వనున్నది. ఇప్పటికే నగరంలో 6వేల కొత్త బస్సులు తిప్పుతామని ప్రకటించింది. ముఖ్యంగా శీతాకాలంలో వాహనాల ఉద్గారాల కారణంగా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతున్నదని.. గాలి కలుషితమై ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతున్నదని కాన్పూర్ ఐఐటీ తాజా నిర్వహించిన సర్వేలో తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi  Pollution  Odd-Even formula  Kejriwal  Pollution control  Delhi Roads  

Other Articles