amalapuram police new idea to control rowdy sheeters activities

Amalapuram rowdy sheeter shocked with police reverse punch

amalapuram police, swami naidu, rowdy sheeter swami naidu shocked, police reverse punch rowdy sheeter, flexi, eastgodavari, police posters on raowdy sheeters flexi, rowdy sheeter swami naidu birthday, east godavari rowdy sheeter swami naidu

amalapuram rowdy sheeter swami naidu shocked with police reverse punch as they posted posters on banners in the city regarding his birthday

పోలీసుల రివర్స్ పంచ్ తో.. స్వామినాయుడు షాక్..!

Posted: 12/13/2015 03:02 PM IST
Amalapuram rowdy sheeter shocked with police reverse punch

ఓ రౌడీషీటర్‌కు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా రివర్స్ పంచ్ ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పోలీసులు. ఓ రౌడీ షీటర్ స్థానికంగా తాను ఒక నేతగా ఎదిగే ప్రయత్నాలను అదిలోనే తుంచివేశారు. తానోకటి తలిస్తే.. దైవం మరోకటి తలచిందన్నట్లు తాను ఒక రౌడీ అని మర్చిపోయిన అమలాపురం పట్టణ ప్రజలకు మరోసారి ఆయన రౌడీ షీటర్ అంటూ గుర్తు చేశారు. బొలెడు డబ్బులు తగిలేసి తన జన్మదిన శుభాకాంక్షల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటే.. వాటిని ఏమీ చేయలేక.. రివర్స్ రూట్ లో వెళ్లిన పోలీసులు ఆయన ఫ్లెక్సీలనే వేదికలుగా చేసుకుని ఆయనకు వ్యతిరేక ప్రచారం నిర్వహించారు. అదెలా అంటే.. రౌడీషీటర్‌ ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీపై... ఆయనో రౌడీ అంటూ మరో చిన్న సైజు ఫ్లెక్సీ అతికించి అందరి దృష్టిని ఆకర్షించేలా చేశారు. ఇలా పోలీసులు ఇచ్చిన రివర్స్ పంచ్ తో స్వామినాయుడుకు బుర్ర వేడెక్కిపోయింది.

అమలాపురంలోని ఆరు రౌడీ గ్యాంగ్‌లలో కొలగాని స్వామినాయుడు ఎలియూస్ నాయుడు కూడా ఒకడు. కాగా, అతని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పట్టణంలో 22 చోట్ల భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. అదే విధంగా గడియారంస్తంభం సెంటర్లో, అందునా మహాత్మా గాంధీ విగ్రహం ఉన్న ట్రాఫిక్ ఐల్యాండ్‌పై భారీ సైజులో నాయుడు ఫ్లెక్సీ పెట్టటాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. అదే ఫ్లెక్సీపై ‘రౌడీషీటర్ గారు శ్రీ కొలగాని నాయుడు గారు... ఇట్లు అమలాపురం టౌన్ పోలీసు’ అని రాసి ఉన్న చిన్న ఫ్లెక్సీలను అతికించారు. ఒక పక్క క్రికెట్ బ్యాట్, మరోపక్క నెత్తురుతో ఉన్న కత్తి బొమ్మలను ఆ ఫ్లెక్సీపై ముద్రించారు. పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ రౌడీషీటర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తూన్నారు. ఆ చర్యల్లో భాగంగానే ఈ రివర్స్ ఫ్లెక్సీని పోలీసులు ఏర్పాటు చేశారు. పోలీసుల చర్యలతో చేసేది లేక మిన్నకుండిపోయన ఆయన.. ఇది ఒక రకమైన ప్రచారమే అనుకుంటారా..? లేక తన వారితో ఫ్లెక్సీలు తీయించివేస్తారా..? చూడాలి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amalapuram police  rowdy sheeter  flexi  eastgodavari  

Other Articles