K-Pop Group Oh My Girl Denied Entry Into U.S., Claims to Be Mistaken for Sex Workers

K pop band oh my girl mistaken for sex workers in los angeles

K-Pop Group, Oh My Girl, U.S. Los angeles, Entertainment News, Los Angeles International Airport, K-Pop Group detained at Los Angeles Airport, oh my girl troop detained at Los Angeles International Airport, National News, International News, Los Angeles, South Korea, ories, News

K-pop act Oh My Girl was reportedly detained at Los Angeles International Airport and denied entry into the United States

ఆ ఢాన్సర్లకు చేదు అనుభవం.. నిలిచిపోయిన షూటింగ్..

Posted: 12/13/2015 12:12 PM IST
K pop band oh my girl mistaken for sex workers in los angeles

అది సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ పాప్ సంగీత బృందం ‘ఓ మై గర్ల్’. అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. సంగీత బృందం సభ్యులు లాస్ఏంజెలెస్‌లో ఓ ఆల్బంను చిత్రీకరించేందుకు విమానంలో లాస్ఏంజెలెస్ బయలుదేరి వెళ్లగా ఆ బృందంలోని పలువురు యువతులను అక్కడి కస్టమ్స్ అధికారులు నిర్బంధించారు. అకారణంగా తమను ఎందుకు నిర్బంధించారని ప్రశ్నిస్తే వారు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు.

తమ దేశంలోకి సెక్స్ వర్కర్లను అనుమతించబోమని అక్కడి అధికారులు చెప్పిన సమాధానంతో నిర్ఘాంతపోయిన యువతులు తాము సెక్స్ వర్కర్లం కామని, సౌత్ కొరియాలోని ప్రముఖ పాప్ బృందం ‘ఓ మై గర్ల్’ సభ్యులమని, ఆల్బం చిత్రీకరణ కోసం వచ్చామని ఎంతగా చెప్పినా అధికారులు వినిపించుకోలేదు. అలా వారిని దాదాపు 15 గంటలపాటు అధికారులు నిర్బంధించారు. చివరికి తాము పాప్ సింగర్ బృందం సభ్యులమని తమ ఆధారాలు చూపించాక వాటిని నిర్ధారించుకున్న అమెరికా విమానాశ్రయ అధికారులు ఎట్టకేలకు వారిని విడిచిపెట్టారు.

ఈ సందర్భంగా పాప్ టీం రికార్డు కంపెనీ డబ్ల్యూఎం ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ అధికారులు మాట్లాడుతూ అధికారులు పొరపాటున వారిని సెక్స్ వర్కర్లుగా భావించారని తెలిపారు. ఈ ఘటనపై తాము చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశంపై ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. కస్టమ్స్ అధికారులు వారిని విడిచిపెట్టిన అనంతరం సౌత్‌కొరియా రాజధాని సియోల్‌కు చేరుకున్నారు. అయితే తిరిగి వారు ఆల్బం షూటింగ్ కోసం లాస్‌ఏంజెలెస్ వెళ్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : K-Pop Group  Oh My Girl  U.S. Los angeles  Entertainment News  

Other Articles