Telangana cm KCR tour to AP

Telangana cm kcr tour to ap

KCR, Chandrababu, KCR in AP, KCR to AP, Chandrababu with KCR, KCR with Chandrababu

Telangana cm KCR will attend the south states representative for the south states Cms meeting in Vijayawada. This is second time to ap

ఆంధ్రాకు కేసీఆర్.. ఒక టూర్ మూడు పనులు

Posted: 12/12/2015 09:06 AM IST
Telangana cm kcr tour to ap

తెలంగాణ సీఎం కేసిఆర్ మ‌రోసారి ఆంధ్రప్రదేశ్ వెళ్లనున్నారు. గ‌తంలో న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తికి వెళ్లిన సిఎం కేసిఆర్ ఈసారి ఆ రాష్ట్ర తాత్కాలిక‌ రాజ‌ధాని విజ‌య‌వాడ‌కు వెళ్ల‌నున్నారు. అప్పట్లో ఏపీ సిఎం చంద్రబాబు ఆహ్వానిస్తే వెళ్లిన కేసిఆర్,ఈసారి చంద్రబాబుని ఆహ్వానించ‌డానికి వెళ్తున్నారు. ఈ నెల 12న కెసిఆర్ విజ‌య‌వాడ టూర్ కు ముహూర్తం కుదిరింది. న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమరావ‌తి శంకుస్థాప‌న‌కు అతిథిగా హాజ‌ర‌య్యారు కెసిఆర్‌ . ఏపి సిఎం చంద్రబాబు ఆహ్వానం మేర‌కు అమ‌రావ‌తి వెళ్ళిన కెసిఆర్‌ , ఈ సారి చంద్రబాబునే ఆహ్వానించ‌డానికి వెళుతున్నారు. ఎపి సీఎం చంద్రబాబును అయుత చండీయాగానికి ఆహ్వానించ‌డానికి ఈ నెల 12వ తేదీన విజ‌య‌వాడ వెళ్తున్నారు. ఇందుకు మ‌రో కార‌ణం కూడా ఉంది. .

తెలంగాణ రాష్ట్రానికి కేసిఆర్ సీఎం కాగానే ఆయ‌న‌ను మ‌రొక ముఖ్య ప‌ద‌వి వ‌రించింది. ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల క‌మిటీకి వైస్ చైర్మన్ అయ్యారు కెసిఆర్‌. ప్రస్తుతం ఈ ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల స‌మావేశం ఈ నెల 12వ తేదీన విజ‌య‌వాడ‌లో జ‌ర‌గ‌నుంది. దీనికి ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రిగా, వైస్ చైర్మన్ గా హాజ‌రుకానున్నారు సిఎం కేసిఆర్. ప‌నిలో ప‌నిగా మిగ‌తా స్వామి కార్యం, స్వకార్యం కూడా క‌లుపుకుని విజ‌య‌వాడ‌కి వెళుతున్నారు కెసిఆర్‌. విజ‌య‌వాడ ప‌ర్యట‌న‌లో మ‌రో కార్యం కూడా ముడిప‌డి ఉంది. ఒక్క టూర్‌తో మూడు ప్రోగ్రామ్స్‌ అన్న‌ట్లుగా కెసిఆర్ విజ‌య‌వాడ ప‌ర్య‌ట‌న ఖ‌రార‌య్యింది. చంద్ర‌బాబును ఆహ్వానించ‌డం, ఇంద్రకీలాద్రిపైనున్న అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌డంతో పాటు ఈ నెల 12 జరిగే ద‌క్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల స‌మావేశానికి హాజ‌రు కావ‌డం. ఈ మూడు కార్యక్రమాల‌తో బిజీ షెడ్యూల్‌తో ఎపికెళుతున్నారు టి సీఎం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Chandrababu  KCR in AP  KCR to AP  Chandrababu with KCR  KCR with Chandrababu  

Other Articles