All parties in the telangana getting ready to win the GHMC elections

All parties in the telangana getting ready to win the ghmc elections

GHMC, Elections, TRS, TDP, Congress, YSRCP, KCR, KTR, manifesto

All parties in the telangana getting ready to win the GHMC elections. TRS, TDP, COngress party leaders getting ready to boost the cader to win GHMC elections.

జిహెచ్ఎంసీలో గెలుపు కోసం పార్టీల పాట్లు

Posted: 12/12/2015 09:03 AM IST
All parties in the telangana getting ready to win the ghmc elections

నూతన సంవత్సరంలో జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ఆయా పార్టీలు మేనిఫెస్టోలను సిద్ధం చేసే పనిలో నిమగ్న మయ్యాయి. ఈ ఎన్నికల్లో తాము ప్రత్యేకంగా మేనిఫెస్టోలను తయారు చేసి ప్రజల ముందుకు వెళ్తామని ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు తెరాసా, కాంగ్రెస్‌, తెదేపాలు ప్రకటించాయి. గ్రేటర్‌ ఎన్నికల బాధ్యతలను తన భుజ స్కంధాలపై వేసుకున్న పంచాయతీ రాజ్‌, ఐటీ శాఖమంత్రి కెటీ రామారావు ప్రత్యేక ఎన్నికల ప్రణాళికను తమ పార్టీ సిద్ధం చేస్తోందని ప్రకటించారు.

అధికార పార్టీ తెరాసా డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలను చేస్తూ ప్రజలకు చెరువయ్యే ప్రయత్నాలు చేస్తోంది. నగరానికి చెందిన మంత్రులతో పాటు కేటీఆర్‌ నగరంలో సుడిగాలి పర్యటనలు నిర్వహించారు. 15 ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేయడంతో పాటు ఎన్నికల ప్రణాళికలో ఇవ్వని హామీలను సైతం తమ ప్రభుత్వం అమలు చేస్తోందని ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గాల వారీగా సమావేశాలను నిర్వహిస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

కాంగ్రెస్‌ పార్టీ సైతం ప్రత్యేక ఎన్నికల ప్రణాళికను రూపొందించేందుకు సమాయత్తమైంది. మరోవైపు తెదేపా కూడా ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించింది. మాజీ రాజ్యసభ సభ్యుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ ఏర్పాటైంది. ఇందులో పార్టీ గ్రేటర్‌ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్‌, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రకాష్‌ గౌడ్‌ సభ్యులుగా ఉన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ గ్రేటర్‌ ఎన్నికలపై పార్టీకి చెందిన సీనియర్లతో శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొంటారని ప్రకటించారు. ఈ నెల 27న నగరంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఆ పార్టీ సమాయత్తమవుతోంది. ఈలోపు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, 150 డివిజన్ల అధ్యక్షులు, పరిశీలకులతో సమావేశం కావాలని లోకేష్‌ నిర్ణయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  Elections  TRS  TDP  Congress  YSRCP  KCR  KTR  manifesto  

Other Articles