Get facebook without internet

Get facebook without internet

Facebook, Internet, internet connection, India, Facebook connection

facebook offering connectivity without internet. In India, america facebook have large number of users. So the Facebook trying to connect the users without internet.

నెట్ లేకున్నా ఫేస్ బుక్

Posted: 12/12/2015 08:59 AM IST
Get facebook without internet

సోషల్ మీడియా పేస్‌బుక్‌ను వాడుతున్న వినియోగదారులకు శుభవార్త. ఇక నుంచి ఇంటర్నెట్‌ సదుపాయం లేకున్నా ఫేస్‌బుక్‌లో పోస్టులపై కామెంట్లు పెట్టొచ్చు. త్వరలోనే తమ వెబ్‌సైట్‌ను ప్రజలకు మరింతగా చేరువ చేసేందుకు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఫేస్‌బుక్‌ ప్రకటించింది. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ నెమ్మదిగా ఉన్నా న్యూస్‌ఫీడ్‌ను అందుబాటులో ఉంచేలా ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రొఫైల్స్‌, టైమ్‌లైన్స్‌, పోస్టులు, గ్రూపులు, పేజీలు, ఈవెంట్స్‌ను అన్వయించవచ్చు అని అయితే గేమ్స్‌ను మాత్రం ఆఫర్‌ చేయబోమని పేర్కొంది.

భారత్‌ లాంటి వర్థమాన మార్కెట్లలో మొబైల్‌ ద్వారా 2జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని ఫేస్‌బుక్‌ను చూసే వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. ఈ విషయాన్ని గుర్తించిన ఆ సంస్థ యూజర్లకు మరింత ఆందుబాటులో ఉండేలా కొత్త అప్‌డేట్‌ను ప్రస్తుతం పరీక్షిస్తోంది. దీని ప్రకారం ఇంటర్నెట్‌ అందుబాటులో ఉన్నప్పుడు ఫోన్‌లో డౌన్‌లోడ్‌ అయిన ఫేస్‌బుక్‌ స్టోరీలను తర్వాత కూడా చూడవచ్చు మెరుగైన నెట్‌ కనెక్షన్‌ ఉన్నప్పుడు రోజంతా ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు న్యూస్‌ఫీడ్‌లోకి వచ్చేలా మెరుగులు దిద్దుతోంది. నెట్‌ లేకున్నా పోస్టులపై కామెంట్లు పెట్టడం ఇప్పుడు సాధ్యమేనని, నెట్‌ కనెక్షన్‌ అందుబాటులోకి రాగానే కామెంట్లు ఆటోమెటిక్‌గా అప్‌లోడ్‌ అవుతాయని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Facebook  Internet  internet connection  India  Facebook connection  

Other Articles