Donald Trumps new anti Muslim outrage is a fresh test for his rivals

Donald trumps new anti muslim outrage is a fresh test for his rivals

America, Donald Trump, American President candidate, Democratic party, Muslims, Donald Trump on Muslims

DONALD TRUMP plays the press “like a fiddle” by saying “outrageous things and garnering attention,” grumbled Jeb Bush recently. “That’s his strategy, to dominate the news.” Mr Bush, a former governor of Florida who is stuck near the back of the field of Republicans seeking the 2016 presidential nomination, has half a point.

ముస్లింలు అమెరికాకు రాకుండా నిషేదం..!

Posted: 12/09/2015 08:38 AM IST
Donald trumps new anti muslim outrage is a fresh test for his rivals

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్ ముస్లింలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోకి ముస్లింలు ప్రవేశించకుండా సంపూర్ణ నిషేధం విధించాలని పిలుపునిచ్చారు. కాలిఫోర్నియా ఊచకోత నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలను ఆయన రాజకీయ ప్రత్యర్థులు, అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా ఖండించారు. అయితే తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో కేవలం తాత్కాలిక చర్యగా మాత్రమే ముస్లింల ప్రవేశాన్ని అడ్డుకోవాలనేది తన అభిప్రాయమని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఉగ్రవాద భావాలతో ప్రేరేపితులైన పాక్ సంతతికి చెందిన దంపతులు కాలిఫోర్నియాలో విచ్చలవిడిగా కాల్పులు జరిపి అనేకమందిని బలితీసుకున్న ఘటనపై అమెరికాలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్న సంగతి తెలిసిందే.

కఠినమైన చర్యలు చేపట్టకపోతే సెప్టెంబర్ 11 తరహా దాడులు మరిన్ని జరుగుతాయని ట్రంప్ హెచ్చరించారు. కేవలం జిహాద్‌ ను నమ్మి అమాయకుల ప్రాణాలు తీసేవారికి అమెరికాను బలిపశువును చేయడం కుదరదని అన్నారు. అసలేం జరుగుతున్నదనేది అమెరికా ప్రతినిధులు తేల్చుకునేంతవరకు అమెరికాలోకి ముస్లింలు అడుగుపెట్టకుండా పూర్తి నిషేధం అమలు చేయాలని అన్నారు. అమెరికాకు ఇంతకుమించి మరోమార్గం లేదని అభిప్రాయపడ్డారు. రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నవారిలో ముందంజలో ఉన్న ట్రంప్ చేసిన ఈ నాటకీయ వ్యాఖ్యలపై డెమొక్రాటిక్ శిబిరం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. హిల్లరీ క్లింటన్ ట్రంప్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇలాంటి మాటలతో అమెరికా భద్రత మరింత తగ్గుతుందనే సంగతి ట్రంప్ గుర్తించాలని ట్విటర్‌లో కామెంట్లు పెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles