Bihar Govt announce 201 holydays

Bihar govt announce 201 holydays

Bihar, Holydays, 201 Holydays, Nitesh Kumar

The Bihar government rise the number of holydays. After taking power Nitesh Kumar govt announce 201 holydays in 2016.

సంవత్సరానికి 201 రోజులు సెలవులే..!

Posted: 12/07/2015 04:41 PM IST
Bihar govt announce 201 holydays

ఆ రాష్ట్రంలో పనిదినాల కన్నా సెలవు దినాలే ఎక్కువట. సంవత్సరంలో 365 రోజులకు గాను 201 రోజులు అంటే సగానికి పైనే రోజులు సెలవులుంటాయట. ఏంటి…201 రోజులు సెలవులా? అని ఆశ్చర్యపోతున్నారా? అవును. నిజమే. బీహార్ రాష్ట్ర గవర్నమెంట్ తాజాగా విడుదల చేసిన 2016 సంవత్సరం సెలవుల జాబితాలో 201 సెలవు దినాలను ఖరారు చేసింది. పండుగలు, పలు కులాలకు చెందిన నేతలకు సంబంధించి వివిధ కార్యక్రమాలతో పాటు పలు జాతీయ దినోత్సవాలు అన్నీ కలిపి భారీగా సెలవులు ఇచ్చేస్తూ నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్ర గవర్నమెంట్. అంటే.. పని చేసే రోజుల కంటే సెలవులు తీసుకోవటమే ఎక్కువన్న మాట.

ఈ తాజా నిర్ణయం వల్ల బీహార్ రాష్ట్రంలో స్టేట్ గవర్నమెంట్ జాబ్ వస్తే పండగేనని కొందరు ఆనందపడుతున్నారు. అయితే ఇలా సెలవులు ఇచ్చుకుంటూ పోతే.. బీహార్ ఎలా అభివృద్ధి చెందుతుందని విశ్లేషకుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ కులాలకు చెందిన నేతల్ని సత్కరించటం, వారికి గౌరవం ఇవ్వటం అన్నది ఖర్చుతో కూడుకున్న పని అని, అదే సెలవులు ఇస్తే ఖర్చు ఉండదని అధికార పార్టీ నుండి సమాధానాలు వస్తున్నాయని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar  Holydays  201 Holydays  Nitesh Kumar  

Other Articles