Spanish galleon found off Colombia with treasure worth two billion dollars

Spanish galleon found off colombia with treasure worth two billion dollars

ship, ship sinks in sea, 300 years ship, Spanish galleon, Juan Manuel Santos , Colombia, the most valuable treasure

Colombian President Juan Manuel Santos said yesterday the location of the galleon San Jose, and how it was discovered with the help of an international team of experts, was a state secret that he would personally safeguard. “This is the most valuable treasure that has been found in the history of humanity,” Mr Santos declared.

1300కోట్ల విలువైన నిధితో సముద్రంలో నౌక

Posted: 12/07/2015 11:04 AM IST
Spanish galleon found off colombia with treasure worth two billion dollars

ఎన్నో ఏళ్ల క్రితం నిధితో సహా సముద్రంలో మునిగిపోయిన నౌకను కనుగొన్నట్లు కొలంబియా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ భారీ నిధికోసం 3 దశాబ్దాలుగా కొనసాగుతున్న పరిశోధకుల వేట ముగిసింది. 300 ఏళ్లకు పైగా దాగిన రహస్యం బట్టబయలైంది. తాము మానవచరిత్రలోనే అత్యంత విలువైన నిధిని కనుగొన్నట్లు కార్టాజినా పోర్టు వద్ద ఆ దేశ అధ్యక్షుడు జుయన్ మాన్యుల్ సాన్ టోష్ ప్రకటించారు. అసలే బంగారంతో కూడిన నౌక.. అందులో 300 సంవత్సరాల నాటిది కావడంతొ యావత్ ప్రపంచం దీని మీద చర్చించుకుంటోంది. అసలు సముద్రంలో ఉన్న ఆ బంగారు నౌక గురించి మరిన్ని ఇంట్రస్టింగ్ మ్యాటర్స్ మీ కోసం..

1708 జూన్‌లో పెరూ నుంచి స్పెయిన్‌కు బయల్దేరిన శాన్‌జోస్ గాలెన్ (బంగారు నౌక)ను మధ్యలోనే బ్రిటిష్ సైన్యం పేల్చివేసింది. తమకు వ్యతిరేకంగా పోరాడుతున్న స్పెయిన్ రాజు ఫిలిప్-5కు సాయం చేసేందుకు ఈ నౌక వెళ్తున్నదని పసిగట్టి ఈ చర్యకు దిగింది. ఈ ఘటనలో నౌకలోని 600 మంది జలసమాధయ్యారు. సముద్రంలో మునిగిపోయిన వాటిలో ఇదే అత్యంత విలువైన నౌక. ఈ నౌక కోసం కొలంబియా ప్రభుత్వం సముద్రాన్ని జల్లెడపట్టింది. 300 ఏండ్ల తర్వాత ఎట్టకేలకు నౌకను, అందులోని నిధులను కొలంబియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రోపాలజీ, నేషనల్ నేవీ, విదేశీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ వివరాలను కొలంబియా అధ్యక్షుడు జాన్ మాన్యూల్ శాంటో మీడియాకు తెలిపారు. నౌకలో 11 మిలియన్ల బంగారు నాణేలు, ఇతర ఆభరణాలు ఉండి ఉండవచ్చన్నారు. త్వరలోనే నౌకను, దానిలోని నిధిని వెలికితీస్తామని చెప్పారు. కాగా ఇప్పుడు ఈ నిధి విలువ 2 బిలియన్ డాలర్లు 13, 000 కోట్లు ఉండవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles