Naked at Lunch review – the funny thing about nudism

The awkward truth about nude cruises

nude beach etiquette, naked at lunch, airport bombs, nude beaches boobs, nude beaches breasts, Mark Haskell Smith

“If you’re at the airport, you don’t make jokes about bombs. When you’re with nudists you don’t make jokes about breasts,” said Mark Haskell Smith

న్యూడ్ బీచ్ లలో దేని గురించి మాట్లాడకూడదో తెలుసా..?

Posted: 12/06/2015 03:19 PM IST
The awkward truth about nude cruises

మీరు ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నప్పుడు బాంబ్స్‌ గురించి మాట్లాడకూడదు.. న్యూడ్‌ బీచ్‌లో ఉన్నప్పుడు బూబ్స్‌ (వక్షోజాలు) గురించి మాట్లాడకూడదు’ ఇది అంతర్జాతీయ పర్యాటకుడు మార్క్‌ హాస్కెల్‌ స్మిత్‌ అనుభవంతో చెబుతున్న మాటలు. ఆసియాలో చాలా తక్కువ గానీ, యూరప్‌ దేశాల్లో న్యూడ్‌ బీచ్‌లు సర్వ సాధారణం. బర్త్‌డే సూట్లతో బీచ్‌కు వచ్చి సన్‌బాత్‌ చేయడం అక్కడి వారి హాబీ. ముఖ్యంగా ఆస్ర్టేలియా, జర్మనీ, ఫ్రాన్స్‌, నార్వే వంటి దేశాల్లో చాలా న్యూడ్‌ బీచ్‌లు ఉన్నాయి. ఫ్రాన్స్‌లో అయితే న్యూడ్‌ సిటీయే ఉంది. దక్షిణ పారిస్‌లో గల కాప్‌ డి ఎడ్జ్‌ సిటీలో సెక్యూరిటీ ఫెన్స్‌ దాటితే ఇక అంతా నగ్నత్వమే. షాపింగ్‌, పోస్టాఫీస్‌, బ్యాంకింగ్‌, రెస్టారెంట్లు, వాకింగ్‌.. వేటికీ బట్టలు వేసుకోనవసరం లేదు.
 
కాగా, ఒక సంవత్సరం పూర్తిగా అంతర్జాతీయ పర్యటనలు చేసిన స్మిత్‌.. తన అనుభవాల ఆధారంగా రాసిన ‘నేక్డ్‌ ఎట్‌ లంచ్‌’ పుస్తకంలో న్యూడ్‌ బీచ్‌లో పాటించాల్సిన జాగ్రత్తలు గురించి రాశారు. బట్టలు విప్పేసి న్యూడ్‌ బీచ్‌లోకి ప్రవేశించిన తర్వాత చాలా డిగ్నిటీగా ప్రవర్తించాలన్నారు. ‘అక్కడి వారి వక్షోజాలు, అంగం సైజుల గురించి మాట్లాడడం కానీ, వాటిని తదేకంగా చూడడం గానీ చేయకూడదు. అక్కడ న్యూడిటీ అనేది శృంగారం కాదు కాబట్టి అలాంటి ఆలోచనలను దరి చేరనీయకూడదు. బట్టలు విప్పి మన దగ్గరే జాగ్రత్తగా పెట్టుకోవాలి. లేకపోతే ఎవరైనా తుంటరులు పట్టుకుపోయే ప్రమాదం ఉంద’ని చెప్పారు. ఇక ముఖ్యంగా న్యూడ్‌ బీచ్‌లకు వెళ్లేటప్పుడు అసలు తీసుకెళ్లకూడని వస్తువు కెమేరా అట. ఎవరైనా కెమేరా లేదా మొబైల్‌ ఫోన్‌ పట్టుకుని బీచ్‌లో నడుస్తూంటే అక్కడ సేద తీరుతున్న వారు అసౌకర్యంగా ఫీలవుతారట.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nude beaches  breasts  Mark Haskell Smith  

Other Articles