Photoshopped image of Prime Minister Modi inspecting Chennai brightens bleak day on Twitter

Photoshopped image of prime minister modi inspecting chennai brightens bleak day on twitter

PM Modi's photoshopped image, Modi's photoshopped image goes viral, PIB deletes tweet, PIB, Press Information Bureau, tweet, photoshopped image, PM Narendra Modi, PM Modi, flood-hit Tamil Nadu, twitterati

The government's attempts to project Narendra Modi's decisive approach to dealing with the Tamil Nadu floods prompted unexpected humour on Thursday, when the official communications agency posted a digitally altered image of the prime minister's aerial survey of the region.

మోదీని ఉతికారేస్తున్న నెటిజన్లు

Posted: 12/05/2015 04:18 PM IST
Photoshopped image of prime minister modi inspecting chennai brightens bleak day on twitter

అసలే సోషల్ మీడియా అందులో మోదీ మీద న్యూస్ వదులుతారా ఏంటీ.. మోదీ గారిని ఎంత ఉతకాలో అంతకన్నా ఎక్కువే ఉతికారేశారు. నెటిజన్లు తమ ప్రతాపాన్ని చూపిస్తూ.. మోదీగారి మీద కసితీర్చుకుంటున్నారు. అసలే మ్యాటర్ ఏంటీ అనుకుంటున్నారా..?  వరదల్లో చిక్కుకున్న చెన్నై నగరంలో ఏరియల్ సర్వే చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫొటోను మార్ఫింగ్ చేసి ఆభాసుపాలైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, అందుకు క్షమాపణ చెప్పినా సోషల్ మీడియా శాంతించడం లేదు. ముఖ్యంగా ట్విట్టర్ యూజర్లు ప్రధాని మోదీ ఫొటోను రకరకాలుగా మార్ఫింగ్‌ చేసి పోస్ట్ చేస్తూ కామెడీ పండిస్తున్నారు.

వాషింగ్ మిషన్-లో ఉతకడానికి వేసిన బట్టలను మోదీ తదేకంగా చూస్తున్నట్టు, ఇండియా ఆడుతున్న క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టు, తన ఉత్పత్తులను ప్రమోట్ చేసుకుంటున్న బాబా రాందేవ్ యాడ్-ను చూస్తున్నట్టు, తన తరఫున రిపోర్టింగ్ చేస్తున్న అనుపమ్ ఖేర్-ను చూస్తున్నట్టు, ఓ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీరును గమనిస్తున్నట్టు, చెన్నైలో ఫొటో మార్ఫింగ్ ద్వారా వెలసిన అమ్మ బాహుబలి ఫొటోను తదేకంగా చూస్తున్నట్టు.. ఇలా ఒకటేమిటి ఎవరికి తోచినట్టు వారు ఫొటోను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడంలో పోటీ పడుతున్నారు. వాటికి సందర్భోచిత వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నారు.

చెన్నైలో వరద నష్టాన్ని అంచనా వేయడానికి గురువారం నగరానికి వచ్చిన ప్రధాని మోదీ సాయంత్రం ఐదు గంటల సమయంలో హెలికాప్టర్-లో ఏరియల్ సర్వే చేశారు. మోదీ హెలికాప్టర్ విండో నుంచి నగరాన్ని చూస్తున్నప్పటికీ ఆకాశం మేఘావృతమై ఉండడంతో అందులో నుంచి ఏమీ కనిపించడం లేదు. ముందుగా ఇదే ఫొటోను ట్విట్టర్-లో పోస్ట్ చేసిన పీఐబీ, విండో నుంచి నగర పరిస్థితి కనిపించడం లేదని భావించి, నగర పరిస్థితికి సంబంధించిన మరో ఫొటోను ఫొటోషాప్-లో కట్ అండ్ పేస్ట్ ద్వారా అతికించింది. దాన్ని ట్విట్టర్-లో పోస్ట్‌ చేసి అంతకు ముందు పోస్ట్ చేసిన అసలు ఫొటోను తొలగించింది. ఇంతలోనే ఈ విషయాన్ని గమనించిన సోషల్ మీడియా పీఐబీ చేసిన తప్పును ఉతికి ఆరేసింది. అలా చేసినందుకు తీవ్రంగా విచారిస్తున్నట్టు పీఐబీ వివరణ కూడా ఇచ్చింది. అయినా సరే, సోషల్ మీడియా కూడా మీడియానే కదా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : photoshopped image  PM Narendra Modi  PM Modi  flood-hit Tamil Nadu  twitterati  

Other Articles