Bomb caused a sensation in Amirpet

Bomb caused a sensation in amirpet

Bamb, Amirpet, hyderabad, Satyam theater, Bomb in Hyderabad, hyderabad Bomb blast

In Hyderabad, Amirpet, Bomb caused sensation near satyam theater. Bomb detectors identified that there is no bomb in that.

అమీర్ పేట్ లో బాంబ్ కలకలం

Posted: 12/05/2015 03:55 PM IST
Bomb caused a sensation in amirpet

హైదరాబాద్ లొ బాంబ్ కలకలం.. మరోసారి బాంబుల మోతా..? అన్న సందేహం కలిగింది. హైదరాబాద్ లో ఎంతో రద్దీగా ఉండే అమీర్ పేట్ లో బాంబ్ ఉందంటూ కలకలం రేగింది. అమీర్ పేట్ సమీపంలోని మైత్రివనం దగ్గర సత్యం ధియేటర్ వద్ద ఒక సూట్ కేసు అనుమానాస్పదంగా కనిపిండంతో స్థానికులు దాని మీద పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వెంటనే అక్కడకు బాంబుస్క్వాడ్ చేరుకుని ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. పాస్‌పోర్ట్ ఆపీసు ఎదురుగా ఉన్న టిఫెన్ సెంటర్‌వద్ద పడిఉన్న సూట్‌కేస్‌ను బాంబు స్వ్కాడ్ తెరిచి చూడగా అందులో ల్యాప్‌టాప్, చార్జర్, కొన్ని దుస్తులు, కాగితాలు మాత్రం ఉన్నాయి.

Also Read: చెన్నై బస్సుల్లో భారీ పేలుళ్లు.. 2002 ఘటనకు లింకుందా?
 
పాస్‌పోర్ట్ పనిమీద వచ్చిన ఎవరో హడావుడిగా టిఫెన్‌చేసి సూట్‌కేస్‌ను మరిచిపోయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. సూట్‌కేస్ బాంబు ఉందని ప్రచారం జరగడంతో పాస్‌పార్ట్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే అక్కడ ఎలాంటి బాంబు లేదని స్క్వాడ్ సభ్యులు తేల్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బాంబుస్వ్కాడ్ వచ్చి సూట్‌ కేసును తెరిచి చూసే వరకూ ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. మొత్తానికి బాంబ్ కలకలం కొంత సేపు అందరిని కంగారు పెట్టినా కానీ చివరకు బాంబ్ లేదని తేలడంతో అందరూ ఊపిరితీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bamb  Amirpet  hyderabad  Satyam theater  Bomb in Hyderabad  hyderabad Bomb blast  

Other Articles