BSNL sends outstanding bill to late President Kalam, left embarrassed

Bsnl issues notice to kerala raj bhavan for telephone dues

APJ Abdul Kalam, BSNL, Thiruvananthapuram, Kerala Raj Bhawan, BSNL issues notice to Kerala Raj Bhavan for telephone dues, kalam telephone bill,

In a rather embarrassing blooper, the government-run Bharat Sanchar Nigam Limited (BSNL) sent a revenue recovery notice to the late president A P J Abdul Kalam for an outstanding telephone bill.

ప్రపంచం మెచ్చిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్.. ఆ భిల్లు బాకీ పడ్డారా..?

Posted: 12/05/2015 10:08 AM IST
Bsnl issues notice to kerala raj bhavan for telephone dues

యావత్ ప్రపంచ మెచ్చిన మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త,  ఏపీజే అబ్దుల్ కలాం. ఆయనకు రాష్ట్రపతి పదవి అలంకార ప్రాయమే అన్నట్లుగా వుండేది తప్ప.. ఆయన పదవిలో వున్నా లేకున్నా.. నిత్యం సేవా కార్యక్రమాలలో పాల్గోంటూ యువతను కలలు కనండి, వాటిని నెరవేర్చుకోండి అంటూ పిలుపునిచ్చి జాగృత పర్చిన  చైతన్యస్పూర్తి ప్రధాత ఆయన. అలాంటిది ఆయన గతించి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. ప్రపంచ దేశాల నేతలు ఆయనకు ప్రఘాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన ఔన్నత్యాన్ని ప్రపంచమంతా గుర్తించినా ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు మాత్రం గుర్తు లేనట్టుంది.

అందకనే తనకు బకాయిపడ్డ స్వల్ప మొత్తాన్ని చెల్లించాలని దివంగత రాష్ట్రపతి కలాంకు బీఎస్ఎన్ఎల్ నోటీసు జారీ చేసింది. అంతేకాక బకాయి చెల్లించని పక్షంలో కలాంకు చెందిన చరాస్తులను జప్తు చేయాలని కూడా తన క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకీ, ఆ సంస్థకు కలాం బకాయిపడ్డ మొత్తమెంతో తెలుసా?... కేవలం రూ.1029 మాత్రమే. అది కూడా తిరువనంతపురం పర్యటనలో భాగంగా ఆయన కేరళ రాజ్ భవన్ లో రెండు రోజుల పాటు బస చేసిన సందర్భానికి సంబంధించిన బిల్లట. ఇక ఏ తేదీతో నోటీసు జారీ అయ్యిందో తెలుసా?... 18, నవంబరు, 2015 తేదీతో..అంటే కలాం చనిపోయిన నాలుగు నెలలకన్నమాట. బీఎస్ఎన్ఎల్ జారీ చేసిన నోటీసుల విషయం తెలుసుకున్న కేరళ రాజ్ భవన్ వర్గాలు షాక్ కు గురయ్యాయి. దీనిపై మరింత చర్చ జరగకముందే, సదరు బిల్లును తాను చెల్లిస్తానంటూ కేరళ రాజ్ భవన్ ప్రకటించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : APJ Abdul Kalam BSNL Thiruvananthapuram Kerala Raj Bhawan  

Other Articles