Zuckerberg defends his new philanthropic initiative

Zuckerberg defends his new philanthropic initiative

facebook, Mark Zuckerberg, Facebook founder Mark Zuckerberg, the Chan Zuckerberg Initiative

Facebook founder Mark Zuckerberg has defended the unusual company structure chosen for the eye-catching philanthropic venture launched to celebrate the birth of his daughter.

ట్యాక్స్ కోసం దానం చెయ్యలేదు: జుకర్ బర్గ్

Posted: 12/04/2015 09:17 PM IST
Zuckerberg defends his new philanthropic initiative

మూడు లక్షల కోట్ల దానం... అన్ని అంకెలు లెక్కబెట్టాలన్న తడబాటు పడేవాళ్లు చాలామందే... కానీ..ఫేస్‌బుక్‌ కో ఫౌండర్‌ జుకర్‌ బర్గ్‌ మాత్రం బర్గర్‌ తిన్నంత ఈజీగా దానం చేసేశాడు. అయితే..ఆ భూరీ దానం వెనక భారీ స్కెచ్‌ దాగుందా? పేరుకు చారిటీ కోసమని చెబుతున్నా..పన్ను నుంచి తప్పించుకునే జాదు పక్రియ జరుగుతోందా..? జుకర్‌బర్గ్‌ దానం చేసిన మూడు లక్షల కోట్ల రూపాయల వ్యవహారమంతా షేర్ల బదిలీ రూపంలో జరగబోతోంది. విడతల వారిగా జరిగే ఈ బదాలాయింపు ఆయన కుటుంబం పేరు మీద ఏర్పాటు కాబోతున్న ఎల్‌ఎల్‌సీ సంస్థకు మారుతుంది. ఇదే జుకర్‌బర్గ్‌ భూరీ దానంపై అనుమానాలకు తావిస్తోంది.

వాస్తవానికి ఎల్‌ఎల్‌సీ ఫౌండేషన్‌ను చారిటీ ట్రస్ట్‌గా కాకుండా లిమిటెడ్‌ లియబులిటీ కంపెనీగా లిస్ట్‌ కాబోతోంది. అంటే ఆ మూడు లక్షల కోట్లను ఏ రకంగానైనా ఖర్చు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. అంతేకాకుండా ట్యాక్స్‌ జోన్‌ నుంచి బయటపడే వెసులుబాటు ఉంటుంది. కానీ పన్నుల నుంచి మినహాయింపుల కోసమే వారు ఇలా చేసినట్టు వస్తున్న ఆరోపణలపై జుకర్ స్పందించారు. విరాళంగా ఇవ్వడం ద్వారా తాను కానీ, తన భార్య ప్రిసిల్లా చాన్ కానీ ఎలాంటి పన్ను మినహాయింపులు పొందబోమని తన ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించారు. తమ షేర్లను అమ్మినప్పుడు ఇతరుల మాదిరిగానే పన్నులు చెల్లిస్తామని చెప్పారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles