The credit does not go to PM Modi but to all the parties says PM Modi

Parliament is functioning credit goes to all parties modi at htls

Narendra Modi, Parliament Sesson, Leadership Summit, Hindustan Times Leadership Summit 2015, Hindustan Times Summit 2015, Speakers at HT Leadership Summit 2015, HT Leadership Summit 2015, HTLS 2015

Prime Minister Narendra Modi reaffirmed on Friday India’s status as one of the fastest-growing economies in the world and stressed that states must work hand in hand with the Centre to keep the pace going.

శుభవార్తే... కానీ ఇందులో నా ఘనత మాత్రమే లేదు..!

Posted: 12/04/2015 04:56 PM IST
Parliament is functioning credit goes to all parties modi at htls

ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగుతుండటం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. "పార్లమెంట్ ఇప్పుడు పనిచేస్తోంది. ఇది శుభవార్తే. ఆ క్రెడిట్ ప్రధాని నరేంద్ర మోదీది కాదు, అన్ని రాజకీయ పార్టీలది" అని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధిలో రాష్టాలూ కీలకభూమిక పోషించాలని ఆయన ఆకాంక్షించారు. ఢిల్లీ నుంచే అభివృద్ధి సాధ్యం కాదని రాష్ట్రాలు తమవంతు పాత్ర పోషించాలని అన్నారు. నిధులను రాష్ట్రాలు ఎక్కడ ఖర్చు చేయాలో ఇప్పటివరకు ఢిల్లీలోనే నిర్ణయించేవారని, తాము ఈ పరిస్థితిని మార్చామని చెప్పారు. శుక్రవారం హిందూస్థాన్ టైమ్స లీడర్ షిమ్ సమిట్ లో ఆయన ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొన్నప్పుడు మనదేశం అభివృద్ధి ఆగలేదని తెలిపారు.

సుస్థిర ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యమని మోడీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని అన్నారు. దేశంలో ఇప్పటికి 18 వేల గ్రామాలకు కరెంట్ లేదని తెలిపారు. గత ప్రభుత్వాలు పనిచేయలేదని తాను చెప్పడం లేదని, 1000 రోజుల్లో గ్రామాలన్నింటికీ కరెంట్ అందిస్తామని హామీయిచ్చారు. కాగా, ఈ వారం ప్రారంభంలో వీకే సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, దేశంలో అసహనం అంశాలపై పార్లమెంటులో వాడివేడి చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో జీఎస్టీ బిల్లులను ఎలాగైనా ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకోవాలని భావిస్తున్న కేంద్రం, ఇప్పటికే పలు విపక్ష పార్టీలతో చర్చలు జరిపింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లను ప్రత్యేకంగా టీ పార్టీకి అహ్వానించిన మోదీ వారితో జీఎస్టీ బిల్లుపై చర్చించారు. మరి అన్ని సక్రమంగా సాగి ఆ బిల్లి పాస్ అవుతుందా..? లేదా..? అన్నది సమావేశాలు ముగిసేలోగా తేలిపోతుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Parliament Sesson  Leadership Summit  

Other Articles