చెన్నైలో పరిస్థితి దారుణంగా మారింది. అక్కడి పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. 20 రోజుల కిందట తుపానుతో ప్రారంభమైన వరుణుడి ప్రతాపం... ఇప్పటికి తగ్గుముఖం పట్టకపోవడంతో... ప్రజల బాధలు వర్ణనాతీతం. నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలన్నీ రంగంలోకి దిగినా... బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకే తోడ్పడతాయి. కానీ, బాధితులకు కల్పించాల్సిన సౌకర్యాల మాటేమిటి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతుండడంతో... అక్కడక్కడ బాధితుల కష్టాలు తీరుతున్నాయి. కానీ, ఇప్పటికీ నాలుగైదు అడుగుల లోతు నీటిలో మునిగిన కాలనీలు, శివారు ప్రాంతాల్లో పరిస్థితి దుర్భరంగా ఉంది. ఈ కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలిచేందుకు...తమవంతు సహకారం అందించేందుకు సిద్ధమయ్యాయి.. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్, స్టార్టప్ కంపెనీలు.
20 రోజుల కిందట తుపానుతో ప్రారంభమైన వరుణుడి ప్రతాపం... ఇప్పటికీ తగ్గుముఖం పట్టకపోవడంతో... ప్రజల బాధలు వర్ణనాతీతం. నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ ఎఫ్ బృందాలన్నీ రంగంలోకి దిగినా... బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకే తోడ్పడతాయి. కానీ, బాధితులకు కల్పించాల్సిన సౌకర్యాల మాటేమిటి? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సమన్వయంతో సహాయక చర్యలు చేపడుతుండడంతో... అక్కడక్కడ బాధితుల కష్టాలు తీరుతున్నాయి. కానీ, ఇప్పటికీ నాలుగైదు అడుగుల లోతు నీటిలో మునిగిన కాలనీలు, శివారు ప్రాంతాల్లో పరిస్థితి దుర్భరంగా ఉంది. ఈ కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలిచేందుకు...తమవంతు సహకారం అందించేందుకు సిద్ధమయ్యాయి.. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్, స్టార్టప్ కంపెనీలు.
వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చెన్నై వాసులకు ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సంస్థ... ఫేస్ బుక్ బాసటగా నిలిచింది. తమ వారి క్షేమ సమాచారం గురించి బంధువులు, స్నేహితులు ఆందోళన చెందకుండా చెన్నై వాసుల స్టేటస్ ను తెలిపేలా సేఫ్టీ చెక్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ తో చెన్నై వాసుల యూజర్ పేజీలో సేఫ్టీ చెక్ ఆప్షన్ వస్తుంది. దీనిలో సేఫ్ గా ఉన్నామని చెబుతూ క్లిక్ చేయడం ద్వారా ఆ సమాచారం బంధువులు, స్నేహితులకు ఆటోమేటిక్ గా చేరిపోతుంది. ఇటీవల ప్యారిస్ దాడుల నేపథ్యంలో కూడా ఫేస్ బుక్ ఈ సదుపాయాన్ని కల్పించింది.
ఇక ఉబర్ క్యాబ్స్ కూడా బాధితుల కోసం రెండు రోజుల పాటు ఫ్రీగా రవాణా సదుపాయం కల్పించింది. కార్లు అద్దెకిచ్చే జూమ్ కార్ కంపెనీ అయితే... తమ వాహనాలను ఫస్ట్ ఎయిడ్ కోసం ఉపయోగించింది. బాధితులను ఆస్పత్రుల్లో చేరవేసేందుకు సహకరించింది. పేటీఎం కంపెనీ 18001030033 అనే టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసిన వారికి...30రూపాయల రీఛార్జి కార్డ్ ఏరేంజ్ చేసింది. ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ తీసుకుంటున్న జొమాటో యాప్ కొత్త స్కీమ్ ను ప్రవేశపెట్టింది. చెన్నైలో బాధితులకు ఒక భోజనం ఆర్డర్ చేస్తే... మరో భోజనం ఉచితంగా అందించే ఏర్పాటు చేసింది. చెన్నైలో ఎన్జీఓతో కలిసి పని చేస్తూ... ఆర్డర్ ఇచ్చిన అర గంటలో... రెండు భోజనాలు వరద బాధితులకు చేరవేస్తుంది.
చెన్నైలో ఇప్పటికీ...సాయం అందని ప్రాంతాలు అనేకం ఉన్నాయి. నిత్యావసరాల్లేక అల్లాడుతున్నారు బాధితులంతా. వీరి కోసం బిగ్ బాస్కెట్ డాట్ కామ్.... నమ్మ చెన్నై రిలీఫ్ పేరుతో సరుకులు అందించే సదుపాయం కల్పించింది. దాతలు ముందుకొచ్చి విరాళం ప్రకటిస్తే, బాధితులకు సరుకులు అందించే ఏర్పాటు చేసింది...బిగ్ బాస్కెట్ డాట్ కామ్. స్టార్టప్ కంపెనీలే కాదు... అనేక స్వచ్ఛంద సంస్థలు, బాధితులను ఆదుకునేందుకు రంగంలోకి దిగి సహాయక చర్యల్లో బిజీగా ఉన్నాయి. ప్రకృతి ప్రకోపానికి... జలసంద్రమైన చెన్నైలో బాధితులను ఆదుకోవాలంటే.. ప్రభుత్వాలే కాదు, సామాన్య పౌరులు కూడా ఉదారంగా వ్యవహరించాలి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more