Family shocked as 'son' rapes their girl

Family shocked as son rapes their girl

Delhi, rape, Son rape Girl, brother rape sister, Rape case, rapes in delhi, Rape capital Delhi, Delhi News

Parents of the 17-year-old girl who was raped and strangled are yet to come to terms with the fact that the youth they had sheltered for so long turned out to be their tormentor. Rajkumar (22) was arrested for not just raping their daughter but also murdering their relative's eight-year-old son who had come to stay with them during Diwali.

వరుసకు చెల్లి.. కానీ వాడు ఆమెను వదల్లేదు

Posted: 12/04/2015 04:08 PM IST
Family shocked as son rapes their girl

కామాంధుల గురించి రోజుకో వార్త చదవాల్సిన దుస్థితి ఏర్పడింది. తాము చేస్తున్న దారుణానికి కొత్తదనాన్ని కలుపుతూ కొత్త క్రైం స్టోరీలకు దారి తీస్తున్నారు. తాజాగా తిన్నింటి వాసాలు లెక్కించిన ఓ మగ మధగజాన్ని ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. అనాథ బాలుడ్ని చేరదీసి ఆదరిస్తే.. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ దుర్మార్గుడు పెంచిన వారి కూతురిపై అత్యాచారం చేశాడు. అక్కడితో ఆగని ఆ మృగం ఈ దారుణాన్ని అడ్డుకోబోయిన ఓ ఎనిమిదేళ్ళ బాలుడ్ని కూడా రాక్షసుడిలా చంపేశాడు. కన్నకొడుకులా చూసుకున్న కుటుంబానికి తీరని గుండెకోతను మిగిల్చాడా దుర్మార్గుడు.

దిల్లీకి చెందిన రాజ్‌ కుమార్‌  చెల్లిలాంటి యువతిపై లైంగిక దాడికి పాల్పడి, అడ్డొచ్చిన ఎనిమిదేళ్ల బాలుడ్ని పొట్టన పెట్టుకున్నాడు. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న రాజ్‌ కుమార్ ను దిల్లీ కద్దాకాలనీలో ఉండే ఓ కుటుంబం ఆదరించింది. కన్నకొడుకులా పెంచింది. వారికి ఓ కూతురు కూడా ఉంది. వయసు పెరిగిన కొద్దీ రాజ్ కుమార్ లో దుర్భుద్ధి మొదలైంది. అన్నలా అండగా ఉండాల్సిన వాడు కాస్తా కీచకుడిలా మారిపోయాడు. ఆమెను తనకిచ్చి పెళ్లి చెయ్యాలని చాలాసార్లు తనను పెంచిన వాళ్లతో గొడవపడ్డాడు. అది తప్పు అని తల్లిదండ్రులు వారించారు.

ఈ క్రమంలో తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన రాజ్ కుమార్ చెంప పగలగొట్టిందా యువతి. దీంతో ఇంట్లోంచి వెళ్లిపోయి ఆమెపై రాజ్ కుమార్ మరింతగా పగపెంచుకున్నాడు. తర్వాత కుటుంబ అవసరాల నిమిత్తం ఆ అమ్మాయి స్థానికంగా ఉండే ఓ బట్టల షాపులో ఉద్యోగం చూసుకుంది. దుకాణానికి దగ్గరగా బంధువుల ఇంట్లో ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న రాజ్ కుమార్‌ పథకం ప్రకారం ఆమెపై దాడి చేశాడు. పొద్దున్నే ఇంట్లోకి చొరబడి, అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించినా వదల్లేదు. రాడ్డుతో తలపై బలంగా మోదాడు. ఆమె కేకలు విన్న ఎనిమిదేళ్ల బాలుడు ఆ దుర్మార్గుడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. చిన్న పిల్లాడనే విచక్షణ మర్చిపోయి ఉన్మాదిలా మారి రాడ్డుతో ఆ పిల్లాడిని తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు వదలడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇలాంటి వాడికి బయటి దేశాల్లో విధించే బహిరంగ ఉరిలాంటివి వేస్తేనే కాస్త బెటర్ అనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  rape  Son rape Girl  brother rape sister  Rape case  rapes in delhi  Rape capital Delhi  Delhi News  

Other Articles