Surprise: missing mentally retarded son meets his family after 18 years

Missing man presumed dead returns home after 2 decades

missing son, mentally retarded guna, Shraddha Rehabilitation Foundation, maharastra bus stop, chandramma, veldhanda police station, Veldhanda tehsildar death certificate, found, alive, return, home, telangana, mother, surprise, psychiatric treatment,

A man who went missing and presumed dead 18 years ago made his way to home at Veldanda town in Teleangana, media reported.

మరణించాడనుకున్న కొడుకు మృత్యుంజయుడిలా తిరిగొచ్చాడు.. అదీ 18 ఏళ్ల తరువాత..

Posted: 12/04/2015 09:59 AM IST
Missing man presumed dead returns home after 2 decades

మతి స్థిమితం లేని కొడుకు తప్పిపోయి 18 ఏళ్లు అవుతుంది. తన కొడుకు కోసం కనబడిన వారినల్లా ఆరా తీసిన అతని తల్లి.. చివరకు మనసును రాయి చేసుకుంది. ఇరుగుపోరుగు వారి సూచనలతో తన కొడుకు మరణించాడని డెత్ సర్టిఫికెట్ కూడా తీసుకుంది. అలాంటిది తన కొడుకు తిరిగోచ్చి అమ్మా అని పిలిస్తే.. ఆ తల్లి ఆనందానికి అవధులు వుంటాయా..? అలాగే ఇక్కడ ఈ తల్లి చంద్రమ్మ ఆనందానికి హద్దుల్లేవు. మరణించాడనుకున్న కొడుకు మృత్యుంజయుడిలా తిరగిరావడం అభూత కల్పన కాదు 'ఇది నిజం!' అయితే ఈ నిజాన్ని చంద్రమ్మే నమ్మలేకపోతున్నానంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. అనారోగ్యందో భాధపడుతూ తప్పిపోయిన కోడడుకు పూర్తి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావడంతో నమ్మలేని నిజాన్ని అమె చవిచూసింది.

మహబూబ్ నగర్ జిల్లాలోని వెల్దందలో ఈ సంఘటన జరిగింది. అయితే, ఇన్ని రోజులుగా గున్న ఎక్కడికెళ్లాడు, ఏమి చేశాడన్న విషయాలపై మాత్రం స్పష్టమైన సమాచారం లేదు. కానీ, గున్నను తల్లి వద్దకు చేర్చిన శ్రద్ధ రిహేబిలిటేషన్ ఫౌండేషన్ ప్రతినిధులు కొన్ని విషయాలు చెప్పారు. మతిస్థిమితం కోల్పోయిన అతన్ని మూడు నెలల క్రితం మహారాష్ట్ర బస్టాండ్ లో చూశామని, అనారోగ్యంతో బాధపడుతున్న అతన్ని ముంబయి ఆసుపత్రిలో చేర్పించి వైద్య చికిత్స చేయించామని అన్నారు. అతని మానసిక పరిస్థితి బాగుండలేదన్న విషయం అప్పుడు బయటపడిందన్నారు. సైకియాట్రిక్ ట్రీట్ మెంట్, కౌన్సెలింగ్ కూడా అతనికి ఇప్పించామన్నారు. ప్రస్తుతం అతని మానసిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉందన్నారు.

 మహబూబ్ నగర్ జిల్లాలోని వెల్దందకు చెందిన కె.కృష్ణయ్య అలియాస్ గున్నకు మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. 1997 లో గున్న తప్పిపోయినప్పుడు అతని వయస్సు 22 సంవత్సరాలు. అతను తిరిగి వస్తాడేమోనని చెప్పి కొన్ని రోజుల పాటు ఎదురుచూసిన తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. దీంతో, వెల్దంద పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. సంవత్సరాలు గడిచాయి కానీ, కొడుకు గురించిన సమాచారం ఏమాత్రం తెలియలేదు. గున్న తండ్రి పుల్లయ్య ఐదేళ్ల క్రితం చనిపోయాడు. గున్న తిరిగొస్తాడన్న ఆశ వదులుకున్నారు. దాంతో పదేళ్లు గడిచిన అనంతరం వెల్దంద తహశీల్దార్ నుంచి గున్న మరణించినట్లు ధ్రువీకరణ పత్రం కూడా తీసుకున్నట్లు చంద్రమ్మ చెప్పింది. ఇంతలో కొడుకు ప్రత్యక్షమవడంతో ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : missing son  mahaboobnagar  veldanda  

Other Articles