Are underworld dons Dawood Ibrahim, Chhota Shakeel still funding Bollywood?

D company still has a strong grip on mumbai real estate

Dawood Ibrahim, Chhota Shakeel, Bollywood, underworld, Bollywood and Underworld, underworld dons, D-Company, Bollywood underworld's connection, Mumbai film industry d gang, Meydan Hotel, Nad Al Sheba, Dubai

Dreaded mafia dons' fascination for Bollywood and the underworld's connection to the Mumbai film industry still remains the same

బాలీవుడ్ ను గుప్పిట్లో పెట్టుకున్న అండర్ వరల్డ్.. చక్రం తిప్పుతున్న డీ గ్యాంగ్

Posted: 12/04/2015 08:23 AM IST
D company still has a strong grip on mumbai real estate

బాలీవుడ్ చలనచిత్రసీమ పరిశ్రమను ఇంకా తన అధిపత్యంలోనే పెట్టుకుని అండర్ వరల్డ్ గ్యాంగులు గుత్తాదిపత్యం వహిస్తుందన్న తాజా వార్త చలనచిత్ర రంగంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. తెరచాటుగా తమ అక్రమ లావాదేవీలను యధేశ్చగా నిర్వహిస్తుందని ఓ జాతీయ అంగ్ల పత్రిక ప్రచురించిన వార్త కలకలం రేపుతోంది. అటు చలనచిత్ర పరిశ్రమతో పాటు ఇటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ అండర్ వరల్డ్ గ్యాంగులు అధిపత్యాన్ని చాటుతున్నాయి హిందు పత్రిక సంచలన కథనాలను ప్రచురించింది.

గతంలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బాలీవుడ్ ను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడన్న విషయం మనకు తెలిసిందే. బాలీవుడ్ నిర్మాతలకు అప్పులివ్వడమే కాక ఆయా చిత్రాల లాభాల్లో భారీ వాటాలను దావూద్ లాగేసుకునే వాడని, ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ నటీమణులతో అతడికి దగ్గరి సంబంధాలు ఉన్నాయన్న పుకార్లు వినిపించాయి. ముంబై దాడుల తదనంతర పరిణామాల్లో తన మకాంను పూర్తిగా పాకిస్థాన్ కు మార్చేసిన దావూద్, బాలీవుడ్ ను వదిలేసి ఉంటాడని అంతా భావించారు.

అయితే నిన్నటి సంచికలో ‘ద హిందూ’ పత్రిక ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికీ దావూద్ తన ప్రధాన అనుచరుడు చోటా షకీల్ తో బాలీవుడ్ పై పెత్తనం చెలాయిస్తూనే ఉన్నాడని ఆ కథనం పేర్కొంది. యూఏఈలో చోటా షకీల్ ఇప్పటికీ బాలీవుడ్ ఈవెంట్లను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాడు. ఈ ఏడాది మే 27 నుంచి 30 మధ్య బాలీవుడ్ కు చెందిన ఓ టాప్ హీరోతో దుబాయ్ లో అతడు పెద్ద కార్యక్రమాన్నే నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి వెళ్లిన ఆ ప్రముఖ హీరోతో దావూద్ కొడుకు, కోడలు కలిసి.. అతనితో ఫోటోలు కూడా దిగేలా.. షకీల్ ఏర్పాట్లు కూడా చేశాడట. దావూద్ కొడుకు, కోడలు బస కోసం దుబాయిలోని మేదాన్ హోటల్ లో ఓ డబుల్ రూంను కూడా బుక్ చేశాడు. ఇక పాకిస్థాన్ కు చెందిన ఓ నటుడు బాలీవుడ్ ఎంట్రీ కోసం చోటా షకీల్ ను సంప్రదించినట్లు ఆ కథనం పేర్కొంది. అయితే ఆ ప్రముఖ హీరో ఎవరన్న విషయాన్ని, అతని పేరును మాత్రం పత్రిక వెల్లడించలేదు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dawood Ibrahim  Chhota Shakeel  Bollywood  

Other Articles