Sanjay Dutt's jail term to be cut short by six months?

Sanjay dutt s jail term reduced by six months

Sanjay Dutt, sanjay dutt jail term, Yerwada jail, sanjay dutt news, munna bhai mbbs, Bollywood actor, Sanjay Dut, sanjay dutt yerawada jail, sanjay dutt good behavior, imprisonment

The 56-year-old Bollywood actor, Sanjay Dut who is currently lodged in Pune's Yerwada Jail, might get lucky and see a six-month cut in his jail term, reportedly.

బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్ కు భారీ ఊరట..

Posted: 12/04/2015 07:40 AM IST
Sanjay dutt s jail term reduced by six months

బాలీవుడ్ మున్నాభాయ్ గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో సంజయ్ దత్ కు భారీ ఊరట లభించే అవకాశం కనిపిస్తున్నది. అక్రమంగా ఆయుధాన్ని కలిగి వున్నాడని నేరంపై ప్రస్తుతం ముంబై లోని ఎర్రవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయనకు శిక్షకాలం తగ్గే అవకాశాలు ప్రస్పుటిస్తున్నాయి. ఆయనను శిక్షాకాలం గడువు కన్నా దాదాపు ఆరు నెలలు ముందే విడుదలే చేసే అవకాశముందని ఓ మహారాష్ట్ర దినపత్రిక తెలిపింది. జైల్లో మున్నాభాయ్ సత్ప్రవర్తనే అందుకు కారణమట. జైలుశిక్షాకాలంలో ఖైదీ సత్ప్రవర్తనతో వ్యవహరిస్తే అతనికి 114 రోజులపాటు శిక్షను తగ్గించే అవకాశముంది. ఈ మేరకు చట్టాల్లో ఉన్న ఓ క్లాజును ఎరవాడ జైలు అధికారులు పరిశీలిస్తున్నారని ఆ పత్రిక తెలిపింది.

ఆ క్లాజు ఏం చెప్తోంది..!

జైలు నిబంధనలకు సంబంధించిన ఓ క్లాజు ప్రకారం ఖైదీ ప్రవర్తన బాగుంటే అతనికి మూడు రోజులు సెలవు ఇస్తారు. అదేవిధంగా తాను ఎంచుకున్న వృత్తిలో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే నాలుగు రోజుల వరకు సెలవు పొందే అవకాశముంది.  ఈ లెక్కన ఓ నెలలో ఏడురోజుల వరకు సెలవు పొందవచ్చు. అంతేకాకుండా ఒక ఏడాదికాలంలో ఖైదీ ఆదర్శప్రాయమైన ప్రవర్తన కనబరిస్తే అతనికి 30రోజల వరకు సెలవు ఇవ్వవచ్చు. ఈ సెలవు 30 రోజులా లేక 60 రోజులా లేక 10 రోజులా అన్నది నిర్ణయించే అధికారం జైలు సబ్ సూపర్ వైజర్, చీఫ్ సూపర్ వైజర్, సీనియర్ పోలీసుల అధికారుల చేతిలో ఉంటుంది.

మున్నాభాయ్ సత్ప్రవర్తన..

జైలులో అత్యంత బుద్ధిమంతుడిగా ఉంటూ తోటి ఖైదీలతో స్నేహంగా మెలుగుతున్న మున్నాభాయ్ కి నెలకు ఏడు రోజులు, సంవత్సరానికి 30 రోజుల చొప్పున తన ఐదేళ్ల శిక్షాకాలంలో మొత్తం 114 రోజుల సెలవు దొరికే అవకాశముంది. దీంతో శిక్షాకాలం నిర్ణీత గడువు కన్నా దాదాపు ఆరు నెలలముందే సంజయ్ విడుదల కావొచ్చునని భావిస్తున్నట్టు ఆ దినపత్రిక తెలిపింది. అయితే ఇప్పటికే ఆయన పలుసార్లు పెరోల్ మీద జైలు నుంచి బయటకు వచ్చి కుటుంబసభ్యులతో గడిపారు. ఈ నేపథ్యంలో సత్ప్రవర్తన క్లాజ్ వర్తిస్తుందా లేదా అన్న అంశాన్ని కూడా  ఎర్రవాడ జైలు అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా ఇందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అటంకాలైనా ఎదురవుతున్నాయన్న అన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : munna bhai mbbs  sanjay dutt  good behaviour  bollywood  yerwada jail  

Other Articles