ISIS Directly Threatens Modi, Vows To Expand War To India

Islamic state s latest manifesto vows to expand war to india

islamic state, islamic state news, PM Narendra Modi, beef killings, islamic state attacks, india islamic state, modi islamic state, islamic state modi, india news, latest news, isis, world news, isis attacks

The Islamic State would now expand beyond Iraq and Syria", Black Flags states. "It would now expand into... India, Pakistan, Bangladesh, Afghanistan [and several other countries

ఐఎస్ఐఎస్ తదుపరి టార్గెట్ భారత్..? బీజేపీ విధానాలపై యుద్దం

Posted: 12/03/2015 10:06 AM IST
Islamic state s latest manifesto vows to expand war to india

ఇస్లామిక్ స్టేట్ ఉద్రవాదుల పేరు చెబితేనే యావత్ ప్రపంచం భాయందోళనకు గురవుతుంది. ఇటీవల వరుసగా పారిస్ సహా పలు దేశాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదలు సృష్టించిన బీభత్సం ఘటనల నేపథ్యంలో వారంటేనే ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి. ముందుకోచ్చి ధైర్యంగా యుద్దం చేసే ధైర్యంలేని ఉగ్రవాదులు దేశంలోని అమాయక ప్రజలను బంధీలుగా చేసుకుని మారణహోమాలకు పాల్పడటం ఇటీవల జరుగిన ఘటనల్లో స్పష్టంమైంది.

ఈ నేపథ్యంలో ఎక్కడ ఏ నాలుగు దేశాల అధినేతలు కలసినా. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉగ్రవాదంపై ఉవ్వెత్తున మండిపడుతున్నాడు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ప్రపంచ దేశాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిస్తూ.. ఆ దిశగా ఏకం అయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నాడు. దీంతో మోడీని, కేంద్రంలోని బీజేపిని టార్గెట్ చేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు భారత్ ను తదుపరి టార్గెట్ గా ఎంచుకున్నారా..? అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.

దీంతో భారతీయుల్లో తీవ్ర భయాందోళనలు అలుముకుంటున్నాయి. మరోమారు ముంబై తరహా దాడులకు ఉగ్రవాదులు తెగబడనున్నారా..? ఇందుకు ప్రణాళికలు రచించారా..? అన్న సందేహాలు భారతీయులను కలవరాన్ని పెంచుతున్నాయి. ఇందుకు  ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు క్రితం రోజున  చేసిన సంచలన ప్రకటనే కారణం. భారత్ పైనా యుద్ధం ప్రారంభిస్తామంటూ ఆ ఉగ్రవాద సంస్థ చేసిన ప్రకటన పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. రొటీన్ కు భిన్నంగా భారత్ లోని రాజకీయ పరిస్థితులను కూడా ఉగ్రవాదులు తమ హెచ్చరికల్లో ప్రస్తావించడం గమనార్హం. అంతేకాక ముస్లింలకు వ్యతిరేకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు చేపడుతున్నారని, ముస్లింలపైకి ప్రజలను ఉసిగొల్పుతున్నారని కూడా ఐఎస్ ఆరోపించింది.

ఈ మేరకు నిన్న తన అధికారిక పత్రికలో ఐఎస్ ఉగ్రవాదులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. భారత్ తో పాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ తదితర దేశాలపైనా దాడులు మొదలుపెడతామంటూ ఉగ్రవాదులు ప్రకటించారు. తమ అధికారిక పత్రికలో ఐఎస్ ఉగ్రవాదులు ఈ మేరకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నానాటికీ పెరిగిపోతోంది. హిందూ సంస్థలకు ఆర్థికపరమైన అండ ఇస్తున్న కొన్ని సంస్థలు పెద్ద సంఖ్యలో ముస్లిం వ్యతిరేకతను పెంచి పోషిస్తున్నాయి.

భవిష్యత్తులో ముస్లింలకు వ్యతిరేకంగా యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నాయి’’ అని ఐఎస్ ఉగ్రవాదులు భారత్ లో జరుగుతున్న రాజకీయ, సామాజిక పరిణామాలను విశ్లేషించారు. ఈ నేపథ్యంలో భారత్ పై యుద్దానికి తాము సమరశంఖం పూరిస్తున్నామని హెచ్చరించారు. అయితే దొంగ దెబ్బ తీయడం కూడా యుద్దమేనా..? ఎదురుగా వచ్చి తలపడటం చేతకాని ఉగ్రవాదులు.. భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని పలువురు బీజేపి నేతలు అంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : islamic state  isis  PM Narendra Modi  beef killings  

Other Articles