The Hindu not published for first time since 1878

The hindu not published for first time since 1878

The Hindu, News Paper, floods, chennai, chenai floods, BBC, The Hindu News Paper

The Hindu, published daily since 1878, did not come out on Wednesday as workers could not access the press. The paper's publisher N Murali told BBC Hindi's Imran Qureshi that it was the first time this had happened. The rains have suspended flights and trains and hundreds of people are without power.

మొదటిసారి ది హిందు పత్రిక ఆగిపోయింది.. ఎందుకంటే

Posted: 12/02/2015 03:03 PM IST
The hindu not published for first time since 1878

ది హిందు పత్రిక ప్రారంభించినప్పటి నుండి నేటి వరకు ఎన్నడూ కూడా నిలిచిపోలేదు. ప్రతి ఉదయాన్నే అందరి గడపల వద్ద ది హిందు పత్రిక ప్రత్యక్షమవుతుంది. 1878 నుండి ప్రారంభమైన ది హిందు పత్రిక గత 137 సంవత్సరాల్లో మొదటిసారిగా పబ్లిష్ కాలేదు. దీని మీద అంతర్జాతీయ మీడియా దిగ్గజం బిబిసిలో కూడా కథనాలు ప్రసారమయ్యాయి. ప్రతి ఉదయాన్నే అందరికి గడపలకు చేరే ది హిందు పత్రిక ఎందుకు పబ్లిష్ కాలేదో తెలుసా..? గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా.. అవును మీరు చదువుతున్నది అక్షరాల సత్యం. వర్షాల ధాటికి అక్కడి జనజీవనం స్తంభించింది.

బిబిసిలో వచ్చిన ఒరిజినల్ ఆర్టికల్ గురించి ఇక్కడ క్లిక్ చేయండి

కాగా ది హిందు పత్రిక కార్యాలయం చెన్నై నగరం నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది. మరైమలైనగర్ లో ది హిందు పత్రిక కార్యాలయం ఉంది. ది హిందు పత్రిక ఎక్కువ కాపీలు సేల్ అవుతుండటంతో దీని కార్యాలయాన్ని చెన్నై పట్టణానికి దూరంగా ఏర్పాటు చేశారు. అయితే గత వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల చెన్నై సముద్రాన్ని తలపిస్తోంది. అయితే వర్షాలు ఎడతెరపీ లేకుండా కురుస్తుండటంతో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. అక్కడి జనాలు కనీసం బయటకు రావడానికి కూడా ఇబ్బంది ఏర్పడింది. అయితే ధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల ది హిందు పత్రిక కార్యాలయానికి సిబ్బంది రాకపోవడం, వర్షంలొ పత్రిక డిస్ట్రిబ్యూషన్ కూడా కష్టమే అని ది హిందు పబ్లిషర్ ఎం. మురళి వివరించారు. మొత్తానికి 137 సంవత్సరాల ది హిందు చరిత్రలో మొదటిసారిగా నిలిపోవడం నిజంగా విశేషమే.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : The Hindu  News Paper  floods  chennai  chenai floods  BBC  The Hindu News Paper  

Other Articles