after several trails failed, girl commits suicide

Failed in uniting parents 9th class girl commits suicide

Girl, parents, 9th class girl Haritha, failed in uniting parents, several trails failed, girl commits suicide, deprated parents, Haritha commits suicide, suicide, Police, chilakalguda, crime

After several trails failed, in uniting her deprated parents 9th class girl Haritha commits suicide in chilkalguda police station limits

తల్లిదండ్రులను ఏకం చేయాలని ప్రయత్నాలు విఫలమై...,

Posted: 11/28/2015 10:45 AM IST
Failed in uniting parents 9th class girl commits suicide

దేవుళ్లు చిత్రంలో అక్క తమ్ముళ్లు కలసి చేసిన పనిని తాను ఒక్కదాన్నే చేయాలనుకుంది విడిపోయిన తల్లిదండ్రులను కలపాలని శతవిధాల ప్రయత్నించింది. తాను అందరిలా తన తల్లి తండ్రులతో కలసి తన జీవితాన్ని గడపాలనుకుంది. నాన్నతో స్కూల్ వరకు వెళ్తూ.. అమ్మకు బై చెప్పాలనుకుంది. పాఠశాల వద్ద నాన్నకు మంచి ముద్దు పెట్టి స్కూళ్లోకి వెళ్లాలని ఆశపడింది. అందుకోసం తాను ప్రయత్నించింది. ఒకటి రెండు కాదు అనేక పర్యాయాలు ఈ ప్రయత్నం చేసింది.

కానీ తన ప్రయత్నాలు విఫలమైన 9వ తరగతి బాలిక.. అందులో సఫలం కాలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ పార్శిగుట్ట సంజీవపురానికి చెందిన రాజు, జగదీశ్వరి భార్యాభర్తలు. రాజు పాన్‌డబ్బా నిర్వహిస్తుండగా, జగదీశ్వరి ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తోంది. వీరు మనస్పర్థలతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. వీరి కుమార్తె బి.హరిత(16) సంజీవపురంలో తల్లి వద్ద ఉంటూ మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది.

అనుభవం లేకపోయినా.. అందుకు తగ్గ వయస్సు కాకపోయినా.. తనకు తోచిన విధంగా తన తల్లిదండ్రులను కలిపేందుకు హరిత ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మనస్తాపానికి గురైంది. దీంతో శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు లోపలికి వెళ్లగా హరిత అప్పటికే మృతి చెందింది. కేసు దర్యాప్తులో ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Girl  parents  suicide  Police  chilakal guda  crime  

Other Articles