న్యాయవాదులు సమ్మెకు దిగడం, కోర్టులు బహిష్కరించడం చేయరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది. జస్టిస్ కురియన్, జస్టిస్ అరుణ్‌లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘సమ్మె ఓ బ్రహ్మాస్త్రం. ఎవరైనా దీన్ని విపత్కర పరిస్థితిలోనే ఉపయోగించాలి. కానీ తరుచుగా సమ్మె మంత్రం జపిస్తున్నారు. ఇది చాలా సీరియస్ సమస్య. న్యాయవాదులు సమ్మె చేయడాన్ని నిషేధిస్తూ కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. దీన్ని పాటించాలి’ అని పేర్కొంది.
ఇటీవల ఢిల్లీ హైకోర్టు, జిల్లా కోర్టుల న్యాయవాదులు ఆస్తుల విచారణాధికార పరిధిపై సమ్మె చేయడంపై న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ద్వారా కామన్‌కాజ్ అనే ఎన్జీవో పిల్ దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. న్యాయవాదుల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది రామ్ జెఠ్మలానీ దీనిపై స్పందిస్తూ సమ్మె చేయడమనేది కూడా రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని అన్నారు. ఈ విషయమై న్యాయవాదులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
బార్ అసోసియేషన్లు కూర్చొని చర్చించి నెలల వ్యవధిలోనే సమస్యకు పరిష్కారం లభించేటట్టు చూడాలని కోరింది. ఉద్దేశపూర్వకంగా రాజ్యాంగ ధర్మాసనం తీర్పును భేఖాతరు చేసిన నేపథ్యంలో ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ జిల్లా బార్ అసోసియేషన్ సమన్వయ కమిటీ చైర్మన్‌కు, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more