woman gets married next to dying father's bedside in hospital

Emergency wedding held in hospitals intensive care unit

emergency wedding icu, Carolinas Medical Center icu turns marriage hall, Charlotte emergency wedding, bride father terminally ill, Jubal Kirby, Anson County, Jubal Kirby incurable lung disease, Kirby’s daughter Kaila Kirby, Kaila Kirby married Daniel Pardue, Daniel Pardue

An emergency wedding was held at Carolinas Medical Center in Charlotte Wednesday for a woman whose father is terminally ill.

ITEMVIDEOS: ఐసీయూలో పెళ్లి బాజాలు.. తండ్రి కళ్లలో అనందం నింపిన తనయ

Posted: 11/27/2015 05:32 PM IST
Emergency wedding held in hospitals intensive care unit

శుభాన్ని తలచడమే శుభముహూర్తం అన్నట్లు.. జీవన్మరణాల మధ్య కోట్టుమిట్టాడుతున్న ఓ తండ్రి తన కూతురి వివాహం చూడలనుకోవడంతో.. పూర్తి నిశ్శబ్దం అలుముకుని వుంటే చోట పెళ్లి బాజాలు మ్రోగాయి. ఎమర్జెన్సీనే శుభ ఘడియలనుకుని ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోనే ఓ జంట ఒక్కటైంది. అమెరికాలోని నార్త్ కెరోలినా హాస్పటల్లో ఈ పెళ్లి వేడుక జరిగింది. ఎమర్జెన్సీ వెడ్డింగ్ డిటైల్స్‌లోకి వెళ్తే..

జుబల్ కిర్బీ చాన్నాళ్లుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నాడు. దీర్ఘకాలంగా ఆయన ఈ వ్యాధి బారిప పడ్డాడు. గత మూడు వారాలుగా ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి చికిత్స చేస్తున్నా.. ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. అతని పరిస్థితి కాస్తంత కష్టంగానే వుందని వైద్యులు చెప్పారు. అయితే తాను ఆస్పత్రిలో చేరేందుకు మునుపే జుబల్ కిర్బీ కుమార్తె కైలా కిర్బీ పెళ్లి నిశ్చయం చేశారు. 2016 జులై 16న అసలు ముహూర్తం. అయితే తండ్రి ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించలేదు. తన వివాహం వరకు తన తండ్రి పరిస్థితి ఎలా వుంటుందో తెలియని కైలా కిర్బీ తన నిర్ణయం మార్చుకుంది.

తండ్రి సమక్షంలోనే పెళ్లి జరగాలన్నది కైలా కోరిక. అందుకే ఆమె ఎమర్జెన్సీగా పెళ్లి చేసుకుంది. అత్యవసరంగా పెళ్లి చేసుకోవాలనుకుంది. జుబల్ చికిత్స పొందతున్న ఇంటెన్సివ్ కేర్ రూమ్‌లోనే కైలా కిర్బీ, డానియల్ పార్దూ ఒక్కటయ్యారు. జుబల్ కిర్బీ ఆ సంతోషాన్ని తట్టుకోలేకపోయారు ఆమె తండ్రి. ఆక్సిజన్ మాస్క్‌తోనే ఆ పెళ్లి వేడుకను వీక్షించాడు. ఆ తర్వాత మాస్క్‌ను తీసి తన కన్నకూతరుకు ఓ ముద్దిచ్చాడు. దాదాపు 50 మంది ఆ వేడుకకు హాజరయ్యారు. డాక్టర్లు, నర్సులు, జర్నలిస్టులే ఆ పెళ్లికి సాక్షులై వధూవరులను చల్లగా నూరేళ్లు వుండాలని అశీర్వదించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : emergencywedding  north carolina  jubalkirby  kaila kirby  

Other Articles