A Housewife suicide because of Amir Khan

A housewife suicide because of amir khan

Amir Khan, Sonam Pandey, Suicide, Mumbai, Madhya Pradesh, Amir Khan intolerance statments, India, Intolerance, Amir Khan News, Suicide for Amir Khan

Sonam Pandey and her husband Mayank were talking about newspaper reports about Khan's statement yesterday morning. My son poked fun at Sonam, saying what kind of man is the Bollywood star, who wants to settle abroad on the advice of his wife," said Mayank's father, RP Pandey. Angered by her husband's criticism of Khan, Sonam ran upstairs and locked herself inside a room, he added.

అమీర్ ఖాన్ వల్ల ఓ ఇల్లాలి ఆత్మహత్య

Posted: 11/27/2015 09:19 AM IST
A housewife suicide because of amir khan

అవును.. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ వల్ల ఓ ఇల్లాలు ఆత్మహత్య చేసుకుంది. అమీర్ ఖాన్ మీద గత నాలుగు రోజులుగా సాగుతున్న దుమారానికి తోడు తాజాగా ఓ ఇల్లాలు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. అమీర్ ఖాన్ దేశంలో పెరుగుతున్న అసహనం ఎంతో ఆందోళన కలిగిస్తోందని.. తన భార్య ఓ దశలో దేశం వదిలివెళదామని అందని కూడా అన్నారు. దాంతో దేశంలో అమీర్ కు వ్యతిరేకంగా నిరసన జ్వాలలు రేగాయి. కాగా తాజాగా అమీర్ చేసిన వ్యాఖ్యల మీద చర్చ దంపతుల మధ్య చిచ్చు పెట్టింది. చివరకు ఓ ఇల్లాలి నిండు ప్రాణాలను బలిగొంది. మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న ఈ ఘటనతో అమీర్ ఖాన్ మీద మరిన్ని విమర్శలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన అయాంక్ పాండే, సోనల్ పాండే దంపతుల మధ్య అసహనంపై ఆమిర్ చేసిన వ్యాఖ్యలపై జరిగిన చర్చ.. ముదిరి వ్యక్తిగతంగా తిట్టుకునే పరిస్థితికి దారితీసింది. దీంతో మనోవేదనకు గురైన సోనల్ పక్క గది లోకి వెళ్లి లోపలినుంచి గడియ పెట్టుకుని విషం తాగిందని.. కాసేపటికి తలుపులు బద్దలు కొట్టి చూడగా సోనల్ అపస్మారక స్థితిలో పడి ఉందని అయాంక్ పోలీసులకు తెలిపారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరి అమీర్ ఖాన్ మీద ఇప్పటికే గుర్రుగా ఉన్న కొన్ని వర్గాలు దీని మీద ఎలా స్పందిస్తాయో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh