drunken youth irritated chiranjeevi, hooted and shouted at car

Megastar chiranjeevi faced shocking experience

chiranjeevi, taj krishna, shocking experiance, chiranjeevi blood bank, drunken youth followed chiru, chiru personal security, chiranjeevi movies, chiranjeevi gallaries, chiranjeevi 150th film, chiru 150 movie director, chiru 50 movie actress, chiranjeevi gallaries, chiranjeevi latest news, mega fans, pawan kalyan, ramchran

Recently Chiru had been to Taj Krishna Hotel in Banjara Hills. As he came out of the hotel in his car, some youths, obviously in inebriated condition followed him and irritated him by hooting and shouting and yelling at the car.

తప్పతాగి చిరు వెంట పడిన పోకిరీలు.. మరి పోలీసులు ఏం చేస్తున్నారు..?

Posted: 11/26/2015 11:53 AM IST
Megastar chiranjeevi faced shocking experience

తెలుగు చిత్రసీమ రారాజుగా వెలుగోందిన మెగాస్టార్ చిరంజీవి సంబంధించిన ఒక వార్త ఆయన అభిమానులను విస్మయానికి గురిచేస్తుంది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికీ పెద్ద సంఖ్యలోనే వున్న మెగా ఫాన్స్ ఈ షాకింగ్ న్యూస్ తెలుసా.. లేదా అన్నది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల చిరంజీవి ఏదో పనిపై బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్ కు వెళ్ళి.. తిరిగి వస్తుండగా, ఆయనను కొందరు యువకులు వెంబడించారు.

చిరంజీవి తాజ్ కృష్ణ నుండి తిరిగి వస్తుండగా కొందరు యువకులు తప్పతాగి.. ద్విచక్రవాహనాలపై ఆయన కారును వెంబడించారట. దాదాపు తాజ్ కృష్ణ నుండి జూబ్లీహిల్స్ లోని చిరంజీవీ బ్లడ్ బ్యాంక్ వరకు ఆ మందుబాబులు చిరు కారుని వెంబడించినట్టు సమాచారం. ఇంతకీ వారెవరు..? చిరంజీవి వెంట ఎందుకు పడ్డారు.? అన్న సందేహం మీకు కలుగుతోందా..? తప్పతాగిన కొందరు యువకులు తన కారును వెంబడిస్తున్నారన్న విషయం తెలుసుకున్న చిరంజీవి.. తనను ఎందుకు ఫాలో చేస్తున్నారని విస్మయం వ్యక్తం చేశారట.

ఆ యువకులు ఎందుకు వెంబడించారు,? వారి పూర్తి వివరాలను తెలుసుకోమని చిరంజీవి కూడా ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి చెప్పినట్టు సమాచారం. అయితే హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రవ్ ను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని ప్రగల్భాలు పలుకుతున్న పోలీసులు బాస్ లు కూడా ఈ ఘటనపై అంతే వేగంగా స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. కేవలం వీకెండ్ రోజుల్లో ముఖ్యంగా రాత్రి సమయాల్లో తాగి వాహనాలను నడిపితే.. పట్టుకుని భారీగా జరిమానాలు విధించే పోలీసులు.. ఈ ఘటన విషయంలో సమాధానం చెప్పాల్సి వుంది. రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి హోదా, మరోవైపు టాప్ సెలబ్రిటీకే రోడ్డు మీద భధ్రత కరువైతే.. ఇక సామాన్యులకు భద్రతను ఎలా కల్పిస్తారన్న విషయాన్ని పోలీసులు వివరించాల్సిన అవసరం వుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi  taj krishna  blood bank  drunkers  security  

Other Articles