A R Rehman too faced similar situation as Amir Khan

A r rehman too faced similar situation as amir khan

Amir Khan, AR Rehman, Intolerance, India, Muhammad: Messenger of God, Music, Iranian film, Amir Khan statements

Oscar-winning music composer AR Rahman said he identified with Bollywood star Aamir Khan's statement on growing intolerance and that his (Khan's) wife felt like leaving the country when he said he (Rahman) too faced a similar situation a couple of months ago.

అమీర్ పరిస్థితి ఎ.ఆర్. రెహమాన్ కు కూడా

Posted: 11/25/2015 09:39 AM IST
A r rehman too faced similar situation as amir khan

తాజాగా అమీర్ ఖాన్ ఎదుర్కుంటున్న పరిస్థితిని తాను కూడా ఎదుర్కున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ తెలిపారు.  అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఆ కామెంట్స్ వేడి చల్లారక ముందే..ఇప్పుడు మరో సెలిబ్రిటీ తోడయ్యారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్..అమీర్ ఖాన్ వ్యాఖ్యలకు మద్దతు పలికేలా సంచలన ప్రకటన చేశారు. తాను కూడా గతంలో అమీర్ ఎదుర్కొన్న పరిస్థితులనే ఎదుర్కొన్నానని రెహ్మాన్ చెప్పడం చర్చనీయాంశమైంది.

గోవా రాజధాని పనాజీలో జరిగిన 46వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెహ్మాన్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతోంది. గతంలో ఇరానియన్ సినిమా ‘ముహ్మద్:మెసెంజర్ ఆప్ గాడ్’కు తాను మ్యూజిక్ అందించిన సందర్భంగా.. ముంబైకి చెందిన రజా అకాడెమీ తనపై ఫత్వా జారీ చేసిందని రెహ్మాన్ గుర్తు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ లలో జరగాల్సిన తన సంగీత కచేరీలను ఆయా రాష్ట్రాల సీఎంలు.. చివరి నిమిషంలో రద్దు చేయించారని ఆయన వాపోయారు. అంతేకాదు హిందూ మతంలోకి మారేందుకు ఇదే సరైన తరుణమని విశ్వహిందూ పరిషత్ నేతలు తనపై ఒత్తిడి తెచ్చారని కూడా రెహ్మాన్ ఆరోపించారు. నాగరిక సమాజంలో ఉన్న మనం హింసకు దూరంగా ఉండాల్సిన అవసరముందని రెహ్మాన్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles