Telangana cm KCR praises Warangal voters

Telangana cm kcr praises warangal voters

KCR, telangana, Warangal, Warangal bypolls, KCR on Oppositions, TRS

Telangana cm KCR praises Warangal voters for excellent judgement in bypolls. He slams oppositions for their behaviour.

మా బాధ్యత మరింత పెరిగింది: కేసీఆర్

Posted: 11/24/2015 04:51 PM IST
Telangana cm kcr praises warangal voters

వరంగల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలుపు మీద తెలంగాణ సిఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి వరంగల్ ప్రజలు చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇచ్చారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ఇందుకు ఓరుగల్లు ప్రజలకు తన రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నానని చెప్పారు. ఈ విజయంతో తమ బాధ్యతలు పెరిగాయని, ప్రభుత్వం పనితీరుకు ప్రజలు ఇచ్చిన మద్దతుగా దీనిని భావిస్తున్నానని పేర్కొన్నారు. వరంగల్ విజయం నేపథ్యంలో హైదరాబాదులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ ఈ మేరకు మాట్లాడారు. వరంగల్ తీర్పుతో సంక్షేమ కార్యక్రమాలకే ప్రజలు పట్టం కట్టారని అర్థమవుతోందన్నారు. ఈ సమయంలో ప్రతిపక్షాల వైఖరిపై ఆయన మాట్లాడారు. కావాలని తనపై, పార్టీపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారని అన్నారు. ఇటువంటి అసహన వైఖరి మంచిది కాదని సూచించారు. ఇన్ని ఓట్లు బతిమాలితే వచ్చేవి కావన్నారు. ప్రజలు వెల్లువలా వచ్చి టీఆర్ఎస్ కి ఓట్లు వేశారని పేర్కొన్నారు.

కేసీఆర్ మాటల్లో ముఖ్యాంశాలు...
*బతిమాలితేనో.. డబ్బులిస్తేనో వచ్చిన ఓట్లు కావివి
*ప్రభుత్వం మీద మరింత బాధ్యతను అప్పగించారు వరంగల్ ఓటర్లు
*వెల్లువలా వచ్చిన ఓటర్లు
*వరంగల్ ఫలితాలు చారిత్రాత్మకం
*విపక్షాలకు ప్రభుత్వం మీద ఇంత అసహనం పనికిరాదు
*ప్రతిపక్షాలు నీచాతి నీచంగా ప్రవర్తించాయి
*ప్రాజెక్టుల మీద మనకు జరుగుతున్న అన్యాయం మీద సర్వే చేయించి, వాటిని రీడిజైన్ చెయ్యాల్సిన అవసరం ఉంది
*అమ్మ పెట్టదు అడ్డుక్కు తినదు అన్నట్లు ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి
*వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రపంచంలో అందరికి నచ్చింది కానీ ప్రతిపక్షాలు మాత్రం దానిని విమర్శిస్తాయి.
*ప్రభుత్వం ఏ పథకం ప్రదేశపెట్టినా వెంటనే దాని మీద విమర్శలు చేస్తాయి ప్రతిపక్షాలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  telangana  Warangal  Warangal bypolls  KCR on Oppositions  TRS  

Other Articles