Police sent notices to twenty members on Mayor Anuradha murder case

Police sent notices to twenty members on mayor anuradha murder case

Chittoor, Mayor, mayor Anuradha, Mayor Anuradha Murder, Chintu, Chintu in Anuradha murder case

Chittoor police summens to twenty persons behalf of Mayor Anuradha murder case. Police search in a women corporater house for evidence

చిత్తూరు మేయర్ హత్య కేసులో చింటు ఆస్తుల జప్తు

Posted: 11/23/2015 11:39 AM IST
Police sent notices to twenty members on mayor anuradha murder case

మేయర్ అనురాధ  హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. హత్యతో సంబందం ఉంది అన్న కోణంలో చాలా మందికి నోటిసులు అందించిన పోలీసులు తాజాగా చింటు ఆస్తుల మీద దృష్టిసారించారు. చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, మోహన్ ల హత్య.. తీవ్ర సంచలనానికి తెర తీసింది. గతంలో కక్షలే కారణమా.? లేదంటే మరే కారణాలైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ వేగం పెంచారు. తాజాగా ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న చింటు  ఆస్తుల మీద దృష్టిసారించారు పోలీసులు. చింటుకు జిల్లాలోనే కాకుండా కర్ణాటకలో కూడా విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం. దాంతో అన్ని ఆస్తులను జప్తు చేస్తున్నట్లు పోలీసులు నోటీసులు అందించారు.

Also Read: ధ్యాంక్స్ చెప్పిన మేయర్ హంతకులు

కాగా మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో సంబందం ఉంది అన్న అనుమానంతో చింటుతో ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయో వారిని విచారిస్తున్నారు. తాజాగా చిత్తూరు మహిళా కార్పోరేటర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. చింటు ఆర్థిక లావాదేవీలతో ఆమెకు సంబందం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే చింటు ఇప్పటి వరకు పోలీసుల కంట కనిపించకుండా తిరుగుతున్నారు. అయితే ఇప్పటి దాకా దాదాపు ఇరవై మందికి నోటీసులు అందించిన పోలీసులు మరో నలభై మందికి కూడా నోటీసులు అందించనున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chittoor  Mayor  mayor Anuradha  Mayor Anuradha Murder  Chintu  Chintu in Anuradha murder case  

Other Articles