Another telugu student named venkata krishna commit suicide in chennai satyabhama engineering college because of seniors ragging | ragging controversies | ragging deaths

Telugu student venkata krishna suicide in chennai satyabhama engineering college ragging crimes

student venkata krishna suicide, venkata krishna ragging suicide, telugu student suicide in chennai college, chennai college ragging incident, venkata krishna suicide in chennai college, ragging deaths, ragging controversies, ragging news

telugu student venkata krishna suicide in chennai satyabhama engineering college ragging crimes : Another telugu student named venkata krishna commit suicide in chennai satyabhama engineering college because of seniors ragging.

‘సత్యభామ’ ర్యాగింగ్ కు బలైన తెలుగు విద్యార్థి

Posted: 11/20/2015 04:17 PM IST
Telugu student venkata krishna suicide in chennai satyabhama engineering college ragging crimes

ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్నో ఉద్యమాలు చేసినా.. జరగాల్సిన అన్యాయాలు జరిగిపోతున్నాయి. ‘వాటిని అరికట్టండి.. లేకపోతే ప్రాణాలు బలవుతాయి’ అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వాన్ని తట్టిమరీ నిద్రలేపినా.. ఏమాత్రం ఫలితం లేకుండాపోతోంది. ఇంకా రానురాను దారుణాలు వెలుగుచూస్తున్నాయే తప్ప.. తగ్గడం లేదు. అలాంటి దారుణాల్లో ‘ర్యాగింగ్’ భూతం ఒకటి. ఇటీవల కాలంలో పెచ్చుమీరిపోతున్న ఈ భూతానికి విద్యార్థులు బలవుతున్నారు. తమ పైశాచికానందం కోసం సీనియర్లు చేస్తున్న ఆగడాలను తట్టుకోలేకపోతున్న జూనియర్లు.. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కాలేజీ యాజమాన్యాలji ఈ ర్యాగింగ్ పై ఫిర్యాదులు అందినప్పటికీ.. వారు చూసిచూడనట్టుగా వ్యవహరిస్తుండటంతో చావే శరణ్యమని విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లోని పలు ప్రముఖ కాలేజీల్లో కొందరు విద్యార్థులు ఈ ర్యాగింగ్ భూతానికి బలవ్వగా.. తాజాగా మరో తెలుగు విద్యార్థి తమిళనాడులోని ప్రతిష్టాత్మక ‘సత్యభామ’ విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాదులోని కూకట్ పల్లికి చెందిన వెంకటకృష్ణ అనే విద్యార్థి తమిళనాడు రాజధాని చెన్నైలోని సత్యభామ వర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. ప్రస్తుతం బీటెక్ సెకండియర్ చదువుతున్న వెంకటకృష్ణపై అక్కడ సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడ్డారు. ఈ ర్యాగింగ్ లో భాగంగా అతని దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడంతోపాటు భౌతిక దాడులకు కూడా దిగారు. ఈ క్రమంలో గతంలోనే తీవ్ర గాయాలపాలైన ఆ విద్యార్థి.. ర్యాగింగ్ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకుండా దాచేశాడు. అయితే.. ఇటీవల సీనియర్ల వేధింపులు మరింత అధికమయ్యాయి. గతంలోకంటే ఎక్కువగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటకృష్ణ.. ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. గురువారం సాయంత్రం కళాశాలలో తాను ఎదుర్కొన్న వేధింపులను 8 పేజీల సూసైడ్ నోట్ లో రాసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురైన అతని తల్లిదండ్రులు.. సూసైడ్ నోట్ చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. దీపావళి సెలవుల కోసం తమ వద్దకు వచ్చిన వెంకటకృష్ణ పండుగను బాగానే చేసుకున్నాడంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తమ కుమారుడు రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులకు అందజేసిన అతని తల్లిదండ్రులు.. ర్యాగింగ్ కు పాల్పడ్డ సీనియర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : student venkata krishna suicide  ragging deaths  

Other Articles