Karate master nageswara rao selfie suicide attempt note

Relatives comments on karate master nageswara rao selfie suicide attempt note

karate master selfie suicide note, karate master nageshwar rao selfie suicide attempt, karate master nageshwar rao, constable nageshwar rao wife's illegal affair, karate master nageshwar rao wife's illegal affair,

Karate master nageswara rao selfie suicide attempt note because of his wife's illegal affair

ITEMVIDEOS: నెట్టింట్లో సంచలనం.. కరాటే మాస్టర్ ఆత్మహత్యయత్నం సెల్ఫీ..

Posted: 11/20/2015 04:01 PM IST
Relatives comments on karate master nageswara rao selfie suicide attempt note

సామాజిక మాద్యమం అందుబాటులోకి వచ్చిన తరువాత వాటిని సద్వినియోగం చేసుకునే వారి సంఖ్య పెరుగుతున్నట్లుగానే దుర్వినియోగం చేసుకుని పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్న వారు మరికోందరు. ఇటీవల తన భార్య వేరొకరితో నిత్యం ఛాటింగ్ చేస్తుందని విసిగివేసారిపోయిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడగా, తాజాగా మరో వ్యక్తి కూడా అదే బాట పట్టాడు. అయితే తన మరణవాంగ్మూలం నలుగురికి తెలియాలని తన ఆత్మహత్యా యత్నాన్ని సెల్ఫీ ద్వారా చిత్రీకరించాడు.

ఈ ఘటనతో ఒక్కసారిగా సికింద్రాబాద్ లోని బాన్సీలాల్ పేటలో కలకలం రేగింది. అటు సోషల్ మీడియాలోనూ ఈ సూసైడ్ నోట్ వీడియో హల్ చల్ చేస్తోంది. గుంటూరు జిల్లా తెనాలి వాసి నాగేశ్వర రావు, బాపట్లకు చెందని వరలక్ష్మీకి పెళ్లికి ముందే పరిచయం ఏర్పడి అది కాస్తా పరిణయానికి దారి తీసింది. ఏడాది క్రితం వరలక్ష్మికి కానిస్టేబుల్ గా ఉద్యోగం రావడంతో అమె నగరంలోనే విధులు నిర్వహిస్తోంది. నాగేశ్వర రావు కరాటే క్లాసులు చెప్తూ జీవనం సాగిస్తున్నాడు. సంతోషంగా సాగుతున్న వారి సంసార జీవితంలో సోషల్ మీడియా వివాదాలకు ఆజ్యం పోసింది.

సంతోష్ అనే ఏఆర్ కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడి తన భార్య నిత్యం అతనితో ఛాటింగ్ చేస్తుందన్న అనుమానం నాగేశ్వర రావు మదిని తొలచింది. అది భరించలేకపోయిన ఆయన సెల్ ఫఓన్ లో సెల్పీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ విషయం గమనించిన స్థానికులు అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karate master  nageshwar rao  selfie  suicide note  

Other Articles