Vijayakanth plans to get Deputy CM post

Vijayakanth plans to get deputy cm post

elections Tamilnadu, Vijayakanth, Vijayakanth in Tamilnadu, Tamilnadu politics, Tamilnadu elections, DMK, AIDMK, karunanidhi, Stalin

Tamil nadu actor and politician Vijayakanth plans to get Deputy cm post in tamilnadu. He may get well nuber of seats in the elections. DMK party leaders discussing with Vijayakanth to support their party in elections

తమిళనాట విజయ్ కాంత్ సూపర్ స్కెచ్

Posted: 11/19/2015 12:14 PM IST
Vijayakanth plans to get deputy cm post

తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అక్కడి పరిస్థితులను క్యాచ్ చేసుకోవడంలో హీరో విజయ్ కాంత్ దాదాపు సపలమైనట్లు కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం పదవి తమకు ఇస్తే డీఎంకేతో దోస్తీ చేసేందుకు తాము సిద్ధం అనే సంకేతాలను డీఎండీకే పంపింది. డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ డీఎంకే దూతల వద్ద మౌనం వహిస్తుండటంతో ఆయన సతీమణి ప్రేమలత రంగంలోకి దిగారు. డీఎంకేను చిక్కుల్లో పడేస్తూ తమకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పొత్తుకు ఓకే అన్న మెలికను ఆమె పెట్టినట్లు సమాచారం. తమిళనాడు రాష్ట్రంలో అధికారమే పరమావధిగా డీఎంకే కుస్తీలు పడుతోంది. ప్రజలను ఆకర్షించేందుకు అనేక విధాలుగా కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేత స్టాలిన్ రాష్ట్రంలో మూడు విడతలుగా పర్యటించారు. తమకు వ్యతిరేకంగా ఎండీఎంకే పావులు కదిపి ప్రజాకూటమి ఏర్పాటుచేసి ఉండటాన్ని తీవ్రంగా పరిగణించిన డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఆ కూటమిని చీల్చేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో కనీస ఓటు బ్యాంక్ ఉన్న డీఎండీకే నేత విజయకాంత్‌ ను ఎలాగైనా తమతో కలిసి అడుగులు వేయించేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు.

Also Read: నా భర్త వస్తాడు.. ఇద్దరం కలిసి తాగుతాం’ బార్ లో భార్య హల్ చల్

విజయకాంత్‌ తో పొత్తు కోసం అతడికి సన్నిహితంగా మెలగుతున్న పలువురు డీఎంకే వర్గాలు, మత పెద్దలు రంగంలోకి దిగారు. విజయకాంత్‌ తో ఇప్పటికే పలు దఫాలుగా దూతలు సంప్రదింపులు జరిపినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. మౌనం వహించిన విజయకాంత్ చివరకు అంతా ప్రేమలతే అంటూ తన సతీమణికి పొత్తు బాధ్యతను అప్పగించినట్టు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన ప్రేమలత డీఎంకేను ఇరకాటంలో పెట్టే రీతిలో తన నిర్ణయాన్ని వెల్లడించినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. తమకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంతో పాటు, తాము కోరిన సీట్లను తప్పనిసరిగా ఇచ్చేందుకు అంగీకరిస్తే దోస్తీకి సిద్ధమని, మళ్లీమళ్లీ సంప్రదింపులు అనవసరమని తేల్చేసినట్లు తెలిసింది. తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలో వచ్చిన పక్షంలో సీఎంగా కరుణానిధి, డిప్యూటీ సీఎంగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టడం ఖాయం. ఏకంగా స్టాలిన్ పదవికి ఎసరుపెట్టే విధంగా ప్రేమలత వ్యవహరించడాన్ని చూసి డీఎంకే వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.  చూడాలి మరి తమిళనాట రాజకీయాలు ఏ కీలక మలుపు తిరుగుతాయో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles