accidental fire near Modis Residence

Accidental fire near modis residence

Modi, fire, firing at Modis House, Firing at PMs house, narendra Modi, Modi on firing, Firing at Modis Residence

Panic spread near Prime Minister Narendra Modi's residence, 7 Race Course road, late on Wednesday evening after gunshots rang in the vicinity of the highly secured area. However, it turned out that the firing was accidental and it had happened when the AK-47 assault rifle of the gunman of a PCR van, Victor 35, went off. Three shots were fired one after another at the spot, which is a parking lot near the 7 RCR. Nobody sustained injuries in the incident, police said.

మోదీ ఇంటి వద్ద కాల్పుల కలకలం

Posted: 11/19/2015 08:16 AM IST
Accidental fire near modis residence

ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి వద్ద కాల్పుల కలకలం రేగింది. మోదీ అధికార నివాసం వెలుపల ఢిల్లీపోలీసు కానిస్టేబుల్‌కు చెందిన రైఫిల్ ప్రమాదవశాత్తు పేలడంతో భద్రతాధికారులు ఉలిక్కిపడ్డారు. కాల్పుల శబ్దం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. రేస్‌కోర్స్ రోడ్డు ఏడవ నంబరు నివాసం వద్ద డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ తుపాకీ మూడుసార్లు పేలడంతో అంతా అప్రమత్తమయ్యారు. ప్రధాని నివాసం ఎదురుగా ఉండే మీడియా పార్కింగ్ వద్ద పోలీసు కంట్రోల్ రూంలో రాత్రి ఈ సంఘటన జరిగింది. భద్రతా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రైఫిల్ లోడ్ చేస్తుండగా తుపాకీ పేలింది.

భద్రతా సిబ్బంది డ్యూటీలు మారే సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. మొదటిసారి తుపాకీ పేలిన తర్వాత ఐదారు నిమిషాలకు రెండోసారి, అరగంట తర్వాత మరోసారి పేలింది. కానిస్టేబుల్ తన ఏకే-47 లోడ్ చేసుకుంటుండగా అది మొత్తం మూడుసార్లు పేలిందని న్యూఢిల్లీ డీసీపీ జతిన్ నర్వాల్ తెలిపారు. ప్రమాదవశాత్తు తుపాకీ పేలిందని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన వెల్లడించారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ఆయన వివరించారు. కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రతి 12 గంటలకోసారి డ్యూటీ మారే సమయంలో ఆయుధాల అప్పగింత సాధారణమేనని, అయితే కాల్పులు మాత్రం సాధారణ విషయం కాదని అంటున్నారు.

సాంకేతిక సమస్య వల్ల తుపాకీ పేలిందని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. కంట్రోల్ రూం వద్ద డ్యూటీ చేస్తున్న పారామిలిటరీ, పోలీసు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఘటనకు కారణమైన తుపాకీని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటన వెనుక ఎలాంటి దురుద్దేశాలు ఉండే అవకాశం లేదని పోలీసులు అంటున్నారు. ఢిల్లీ పోలీసు కమిషనర్ గురువారం ప్రధాని కార్యాలయానికి, క్యాబినెట్ సెక్రటేరియట్‌కు సమగ్ర నివేదిక సమర్పిస్తారు. తుపాకీ కాల్పుల శబ్దం విన్న వెంటనే భద్రతాధికారులు హుటాహుటిన కంట్రోల్ రూంవద్దకు చేరుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles