paris attacks mother died using her body to shield her five year old son from bullets

Mother shield her five year old son from bullets

Paris attacks 2015, five-year-old boy survived, mother saved kid, Islamic State, Paris Attacks, Elsa Delplace, Paris's Bataclan, Eagles of Death Metal concert, Patricia San Martin, Le Point magazine, Sihem Souid, tribute

A five-year-old boy survived the massacre in Paris's Bataclan theatre after he was sheltered from the bullets by the body of his dead mother.

తన ప్రాణాలను అడ్డుపెట్టి.. తనయుడిని కాపాడిన ‘శివగామి’

Posted: 11/18/2015 09:31 PM IST
Mother shield her five year old son from bullets

అమ్మ మమకారం, ప్రేమానురాగం కొలమానమైనవి కావు. అవి అత్యంత విలువైనవి. వారి పిల్లలకు అవసరం వచ్చినప్పుడో,. అపద ముంచుకోచ్చినప్పుడో కానీ వారి ధైర్యసాహసాలు కూడా కనబడవు. ఇది ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, అంతే. ఈ విషయాన్ని ఎందరో తల్లులు రుజువు చేస్తూనే వున్నారు. తాజాగా పారిస్ బాటాక్లాన్ థియేటర్‌లో ఈగల్స్ ఆఫ్ డెత్ మెటల్ సంగీత విభావరి ఎలా ఉంటుందో చూడటానికి వెళ్లిన లూయిస్ విషయంలోనూ మరోసారి రుజువైంది. సంగీత ఝరులు వీనులవిందు చేస్తాయని భావించిన ఐదేళ్ల కుర్రాడికి బుల్లెట్ల వర్షం కురవడం, ఆర్థనాదాలు, హాహాకారాలు వినిపించాయి అయినా ఆ పెను విపత్తులో కూడా ఆ పసివాడికి ఏమీ కాలేదు. సురక్షితంగా బయలపడ్డాడు.

అనూహ్య ఘటనలు చూసి బిత్తెరపోయిన లూయిస్ అస్పత్రిలో కోలుకుంటున్నాడు. అయితే ఆస్పత్రిలో వున్న లూయిస్ తన తల్లి కావాలని ఏడుస్తున్నాడు. అతనికి తెలియదు తాను బతికి వుండటాని.. తన మాతృమూర్తే కారణమని.. ఆమె తన దేహాన్ని బులెట్లకు అడ్డుగా పెట్టి మరీ తన కొడుకు లూయిస్ ను బతికిందించిందని, శివగామిలా కాపాడిందని.  గత శుక్రవారం పారిస్‌లో ఉగ్రవాదుల నరమేధం మిగిల్చిన పెనువిషాదం ఇది.

పారిస్‌లోని బాటాక్లాన్ థియేటర్‌లో కాన్సర్ట్‌కు ఐదేళ్ల లూయిస్ తల్లి ఎల్సా డెల్‌ప్లెస్‌ (35), అమ్మమ్మ పాట్రిషియా సాన్‌ మార్టిన్ (61)తో కలిసి వెళ్లాడు. అక్కడ జరిగిన ఉగ్రవాదుల నరమేధంలో లూయిస్ తల్లి, అమ్మమ్మ చనిపోయారు. వారిద్దరు ఉగ్రవాద తూటాలకు అడ్డుగా నిలబడి ఆ చిన్నారి ప్రాణాలను నిలిపారు. వారిద్దరి మృతదేహాల నడుమ నెత్తుటిధారల మధ్య లూయిస్ ప్రాణాలు దక్కించుకున్నాడు. కొడుకు ప్రాణాల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన ఆ అమ్మ, అమ్మమ్మలకు ఘనంగా నివాళులర్పిస్తూ ఎల్సా స్నేహితురాలు సిహెమ్‌ సొయిద్ 'లీ పాయింట్‌' అనే మాగజీన్ లో ఓ వ్యాసం రాశారు. తన కొడుకును ఎప్పుడూ ఆశాకిరణంగా భావించేదని, ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టిన కాపాడిన లూయిస్‌ ఇప్పుడు ఆస్పత్రిలో బిత్తరచూపులు చూస్తున్నాడని ఆమె వివరించింది.

ఎల్సా ఎప్పుడూ ఆనందంగా ఉండేంది. కష్టకాలంలోనూ ఆమె పెదవులపై ఎప్పుడూ చిరునవ్వు తొణికిసలాడేది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ముందుండేది. కళా, సాంస్కృతిక ప్రపంచంతో సన్నిహితంగా మసిలేది. ఆమె ఎప్పుడూ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడేది. చిలీ నియంత పినొచెట్‌పై పోరాడి ఆమె తల్లి ఇక్కడి వచ్చింది. ఆ పోరాట వారసత్వం ఆమెలో ఉండి ఉంటుంది' అని ఎల్సా మిత్రురాలు ఈ స్మృతి వ్యాసంలో పేర్కొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paris Attacks  Elsa Delplace  Islamic State  tribute  

Other Articles