A Father and Son Conversation After Paris Terror is Viral

A father and son conversation after paris terror is viral

paris attack, paris, France. paris Residents, ISIS attack on Paris, France on ISIS, Father and son after Paris attack

Near the Bataclan Theatre in Paris, where 89 concert-goers were killed in the Friday terror attacks, a little boy gets gentle reassurance from his father that terrorists 'have guns but we have flowers'. "I feel better," the boy finally tells a French TV reporter who recorded the exchange. Facebook user Jerome Isaac Rousseau translated the video and shared what he called the "most precious conversation." "They're my heroes. I feel better too now!", he says.

ITEMVIDEOS: క్యాండిల్స్, ఫ్లవర్స్ కాపాడతాయా.? ఓ చిన్నారి ప్రశ్న

Posted: 11/18/2015 11:14 AM IST
A father and son conversation after paris terror is viral

ప్యారిస్ మీద  ఉగ్రవాదులు దాడులకు తెగ బడ్డారు. 129 మంది అమాయలకు ప్రాణాలను తీశారు. ప్యారిస్ లో రద్దీగా ఉండే పలు ప్రాంతాల్లో ఒకే టైంలో చేసిన దాడులతో నగరం మొత్తం ఉలికిపడింది. అయితే ప్యారిస్ దాడి తర్వాత ఎంతో మంది ఆశలు కోల్పోయారు. ప్యారిస్ మీద వారు నమ్మకం కోల్పోయారు. అయితే ప్యారిస్ మీద దాడికి ప్రతీకారంగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల స్థావరాల మీద ఫ్రాన్స్ దేశం యుద్దానికి దిగింది. ఉగ్రవాదుల దాడుల మరకలు ఇంకా ఫ్రాన్స్ లో తొలిగిపోలేదు. అయితే అక్కడి వారి జీవితాలను కకావికలం చేసిన ప్యారిస్ దాడి తర్వాత ఓ చిన్నారి వేసిన ప్రశ్న.. ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. చిన్నారి తన తండ్రిని ప్రశ్నిచడం.. ఆ తండ్రి తన చిన్నారికి దైర్యం చెప్పిన విధానం అందరికి కొత్తగా అనిపించింది.

Also Read: బారత్ లో ఐసిస్ దాడులకు అవకాశాలు.. అప్రమత్తత

ఓ టీవీ ఛానల్ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. తమ నగరంలోకి బ్యాడ్ గాయ్స్ వచ్చారని... వారు చేతిలో గన్స్ పట్టుకున్నారని అని ఓ చిన్నారి వివరిస్తున్నాడు. అయితే ఈ ఘటనతో ప్యారిస్ ను వదిలి వెళ్లాల్సిన అవసరం ఉందని ఆ చిన్నారి తన తండ్రికి చెప్పగా.. ఆ చిన్నారి తండ్రి ప్యారిస్ తమ ఇల్లు అని.. సమాధానం చెబుతాడు. తర్వాత చిన్నారి ఆ బ్యాడ్ గాయ్స్ మళ్లీ వస్తే.. అంటే అందుకే కదా మనం క్యాండిల్స్, ఫ్లవర్స్ తీసుకున్నాం అంటూ తన చిన్నారికి దైర్భం చెబుతాడు. ఈ వీడియో ప్యారిస్ నగరంలో పరిస్థితిని అద్దం పడుతుంది. కానీ ఈ దాడి ప్యారిస్ నగరం మీద ఎలాంటి ప్రభావం చూపలేదని.. ఫ్రాన్స్ పౌరులు ఎంతో దైర్యంవంతులని తేటతెల్లం చేసింది.

-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles