Paul Walker’s Death Was His Fault

Paul walker s death was his fault

Paul walker, Fast and Furious, walker, Paul Walker in Fast And Furious cinema, paul Walker Death, porsche cars, porsche

The luxury car manufacturer claims that the November 30, 2013 crash that killed Fast & Furious star Paul Walker was his “own comparative fault.” Seeking to have the wrongful death lawsuit that the actor’s teenage daughter filed in late September tossed, Porsche said late last week that the 2005 Porsche Carrera CT Walker and driver Roger Rodas were in had been “abused and altered” as well as “misused and improperly maintained.”

పాల్ వాకర్ చావుకు కారణం అతడే

Posted: 11/17/2015 04:50 PM IST
Paul walker s death was his fault

హాలీవుడ్ హీరో పాల్ వాకర్ పేరు తెలియని వాళ్లుండరు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ లో సినిమా చూసేవాళ్లకు కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు పాల్ వాకర్. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలో కార్ల రేసింగ్ గురించి.. ఛేజింగ్ మీద ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందికి ఆసక్తి ఉంది. అందుకే సినిమా విడుదలైన అన్ని సిరీస్ లు సూపర్ హిట్ అయ్యాయి. అయితే పాల్ వాకర్ సినిమాలో మాదిరిగా స్టంట్స్ చేసే క్రమంలో కారు ప్రయాణంలోనే మరణించారు. అయితే పాల్ వాకర్ చావుకు కార్ల తయారీ కంపెనీ పోర్షె కారణం అంటూ వేసిన కేసులో కంపెనీ జవాబునిచ్చింది. అసలు కారణం ఏంటో ఆ కార్ల కంపెనీ కోర్టుకు వెల్లడించింది. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న పాల్ వాకర్ మరణం చాలా మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది.

Also Read: దానికోసం తాపత్రయం పడుతున్న ఏంజెలీనా జోలీ

కార్ల  కంపెనీ నిర్లక్షం కారణంగానే పాల్ వాకర్ అకాల మరణం సంభవించిందని అతడి భార్య కోర్టులో కేసు వేసింది. అయితే పాల్ వాకర్ ప్రమాదానికి గురైన కారు 2005 కెరీరా జీటీ గురించి అతడికి క్షుణ్నంగా తెలుసునని పేర్కొంది. ఈ కారు వినియోగించడం వల్ల తలెత్తే అపాయం, ప్రమాదాల గురించి అతడికి పూర్తి అవగాహన ఉందని వెల్లడించింది. కారు గురించి అన్ని తెలుసుకుని స్వచ్ఛందంగా దాన్ని ఉపయోగించారని తెలిపింది. అతడి మరణానికి తాము ఏ రకంగానూ కారణం కాదని పోర్షె స్పష్టం చేసింది. కారులొ ఎలక్రికల్ స్టెబిలిటీ సిస్టమ్ సరిగా లేదని.. అదే టైంలో మరికొన్ని సాంకేతిక కారణాల వల్లే ప్రమాదం జరిగిందని పాల్ వాకర్ భార్య తరఫు లాయర్ వాదించారు. అయితే కారు గురించి మొత్తం అతడికి తెలుసునని.. అతడు రిస్క్ తీసుకొని కార్ ను డ్రైవ్ చేసినట్లు పోర్షె కంపెనీ కోర్టులో తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles