Four years old Girl Dies After Stuck In Lift

Four years old girl dies after stuck in lift

Lift, Stuck in Lift, School Kid, School kid dies in Lift

four Years school kid dies afetr stuck in Lift. In Hyderabad Star kids school, a small kid stuck in a lift and she dies.

ITEMVIDEOS: చిన్నారి ప్రాణాలు తీసుకున్న లిఫ్ట్

Posted: 11/17/2015 11:29 AM IST
Four years old girl dies after stuck in lift

పాల బుగ్గల చిన్నారి.. లిఫ్ట్ కు బలైపోయింది. ఆడుతూ పాడుతూ స్కూల్ కు వెళ్లిన చిట్టి తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లింది. చదువవుల కోసం అని పంపిస్తే శవాన్ని చూడాల్సి వచ్చిందా అంటూ ఆ చిన్నారి తల్లిదండ్రులు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. స్కూల్లో పిల్లల పట్ల యాజమాన్యం, టీచర్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలుస్తుంది. స్కూల్ యాజమాన్యం లక్షలకు లక్షల రూపాయల ఫీజులు దండుకోవడానికి ఎంత ముందుంటాయో వారి బాగోగులను చూడడంలో మాత్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని ఓ స్కూల్ లో లిఫ్ట్ లొ ఇరుక్కొని చిన్నారి ప్రాణాలను విడిచింది.

Also Read: చిన్నారి కిడ్నాప్ తో ‘వ్యభిచార రాకెట్’ గుట్టురట్టు

నగరంలోని దిల్ సుఖ్ నగర్ లోని సార్క్‌కిడ్స్‌ స్కూలులోని లిఫ్టులో ఇరుకొన్న నాలుగేళ్ల చిన్నారి ఫాతిమా జహానా మృతి చెందింది. లిఫ్టు పైకి వెళ్లే సమయంలో కరెంటు పోవడంతో ఆగింది. దీంతో విద్యార్థులు లిఫ్టును బలవంతంగా తెరిచారు. ఆసక్తితో చిన్నారి ఫాతిమా జహానా తల బయటపెట్టింది. ఆకస్మాత్తుగా కరెంట్‌ రావడంతో లిఫ్టు పైకి వెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడిన చిన్నారి ఫాతిమా జహానా మృతి చెందింది. ఈ ఘటనతో చిన్నారి తతల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదించారు. లిఫ్టులో ఆయా కూడా లేకపోవడం, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lift  Stuck in Lift  School Kid  School kid dies in Lift  

Other Articles