KCR distributed 2BHK houses at IDH Colony

Kcr distributed 2bhk houses at idh colony

KCR, Double Bed rooms, Poor, Double Bed rooms for poor people, Telangana govt, Telangana Double Bed Room scheme

This will be first set of 2BHK houses to be distributed among the poor beneficiaries by the TRS Government as part of fulfillment of poll promises. Telangana ministers, legislators and senior officials will attend the function. Originally, the distribution of 2BHK houses was planned on October 22 on the occasion of Dussera festival. However, the same was postponed due to KCR’s participation in the foundation stone laying ceremony of Amravati, the new capital of Andhra Pradesh.

ఇది చరిత్రలోనే కొత్త అంకం: కేసీఆర్

Posted: 11/16/2015 03:53 PM IST
Kcr distributed 2bhk houses at idh colony

తెలంగాణ సిఎం కేసీఆర్ ఎంతో కాలంగా చెప్పుకుంటూ వస్తున్న డబుల్ బెడ్ రూంలకు మోక్షం లభించింది. ప్రతీసారి అందరికి మంచి డబుల్ బెడ్ రూంలు కట్టిస్తామని చెప్పిన కేసీఆర్.. హైదరాబాద్ లో మొదటిసారిగా డబుల్ బెడ్ రూం ఇళ్లను అర్హులకు అందించారు. ఇవాళ ఐడీహెచ్ కాలనీలో పేదల కోసం నిర్మించిన డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లను సీఎం ప్రారంభం చేశారు. గత దసరాకు ఇక్కడ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుని నేటి వరకు పూర్తి చేసుకున్నామని.. కొత్త ఇళ్లు వేగంగా పూర్తి కావడం చాలా సంతోషంగా ఉందని కేసీఆర్ వెల్లడించారు. దేశ చరిత్రలోనే కొత్త అంకానికి తెరతీశామని కేసీఆర్ తెలిపారు.

Also Read: కేసీఆర్ తెలంగాణ కార్డు ఎన్ని రోజులు పట్టుకుంటాడు..?

396 పేద కటుంబాలకు ఐడిహెచ్ లో డబుల్ బెడ్ రూం ఇళ్లు అందించడం జరిగింది. 60 ఏళ్ల పాలనలో ఏ ప్రభుత్వమూ చేయని పని తెలంగాణ ప్రభుత్వం చేసిందని సీఎం అన్నారు. గతంలో పేదలకు ఇండ్లు అంటే ఊరవతల కట్టించి ఇచ్చేవారు... కానీ మా ప్రభుత్వం పట్టణాలు, నగరాల్లోనే ఇండ్లను నిర్మించి ఇస్తోందని అన్నారు.  పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కోసం 4 వేల కోట్లు కేటాయించుకున్నామని కేసీఆర్ తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి నాలుగు వందల చొప్పున ఇండ్లను నిర్మిస్తాని అన్నారు. గతంలో పేదలకు ఇండ్లు అంటే డబ్బా రూమ్‌లు ఉండేవి కానీ ఇప్పుడు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles