pregnant us women sue over mislabeled birth control pills

Local woman gets pregnant after taking faulty birth control pills

100 women, pregnant, birth control pills, Philadelphia, law suits, protected from pregnancy, lawsuit birth control pills manufacturer, manufacturer, birth control pills packaged incorrectly.

100 women who thought they were protected from pregnancy by their birth control pills have filed a lawsuit against a manufacturer because the pills were packaged incorrectly.

వద్దనుకుని వేసుకున్నారు.. అయినా రావడంతో కోర్టుకెక్కారు..

Posted: 11/14/2015 07:10 PM IST
Local woman gets pregnant after taking faulty birth control pills

అప్పుడే గర్భం దాల్చడం వద్దనుకుని గర్భ నిరోధక మాత్రలు వేసుకున్నా తాము గర్భం దాల్చడం పట్ల ఆ మహిళలు విస్మయం వ్యక్తం చేశారు. వద్దనుకుని వేసుకున్నా తమకు గర్భం వచ్చేలా చేసిన గర్బనిరోధక మాత్రలపై, వాటి తయారీదారులపై వారు మండిపడుతున్నారు. ఆ మాత్రలు తయారుచేసిన ఫార్మాసూటికల్స్ కంపెనీలపై కొందరు మహిళలు కేసులు వేశారు. తమకు భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలంటూ నోటీసులు పంపించారు. అమెరికాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన మహిళలు ఆ కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిలడెల్ఫియాలోని కొందరు మహిళలు తమకు గర్భం దాల్చడం ఇష్టం లేక గర్భ నిరోధక మాత్రలు వేసుకున్నారు.

అయినా, అవి పనిచేయకపోవడంతో వారు గర్భం దాల్చాల్సి వచ్చింది. ఇలా దాదాపు 100మంది మహిళలు తమకు ఇష్టం లేకపోయినా త్వరలో తల్లులుకాబోతున్నారు. అయితే, కొన్ని కంపెనీలు నిర్లక్ష్యంగా తయారుచేసిన మందుల కారణంగానే తమకు ఈ పరిస్థితి వచ్చిందంటూ ఫిలడెల్ఫియాలోని మొత్తం నాలుగు కంపెనీలపై కేసులు పెట్టారు. తమకు భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని, తమ పిల్లలకు 18 ఏళ్లు వచ్చేవరకు ఆయా రూపాల్లో (విద్య, వైద్యం, పెరుగుదల, నిర్వహణ) అయ్యే ఖర్చును భరించాలని పేర్కొంటూ కోర్టు ద్వారా నోటీసులు పంపించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 100 women  pregnant  birth control pills  Philadelphia  law suits  

Other Articles