Apple apologises after African students ejected from Australian store

Apple apologises after allegations of racism by australia schoolboys

Australia, Apple, social, African students, Apple apologises after racism outcry, Apple, Australia, Africa, teenagers, store, might steal something, manager, apologise, video, Australia,Australia and the Pacific,World News,News

An Apple manager has apologised to six teenagers of African descent after staff kicked them out of an Australian store. video of the incident going viral on Facebook.

ITEMVIDEOS: ఆ పాఠశాల విద్యార్థులకు.. యాపిల్ క్షమాపణలు

Posted: 11/12/2015 08:25 PM IST
Apple apologises after allegations of racism by australia schoolboys

వర్ణ వివక్ష అంతరించి పోయిందని గొప్పలు చెప్పుకునే పాశ్చాత్య దేశాల్లో నేటికీ అ జాడ్యం ఇంకా ప్రభలుతూనే వుందని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో గల యాపిల్ స్టోర్‌లో జరిగిన ఘటన ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. ఈ కంపెనీ ఆఫీసుకు ఆరుగురు నల్ల జాతీయులు వచ్చారు. వారందరూ టీనేజర్లు కావడంతో వారిని స్టోర్ నుంచి వెళ్లిపోవాలని సెక్యూరిటీగార్డు సూచించాడు. ఎందుకు వెళ్లిపోవాలని ప్రశ్నిస్తే.. 15 నుంచి 16 సంవత్సరాల నల్ల జాతీయులు ఏదైనా దొంగిలిస్తారేమోనన్న అనుమానంతో రానివ్వమని సెక్యూరిటీ తెలిపాడు.

ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన నల్లజాతి యువకులు ఘటననంతా వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 'సింపుల్ రేసిజం' అనే టైటిల్ తో ఫేస్ బుక్ లో పెట్టగా దానిని ఇప్పటికే 60,000మందికి పైగా చూశారు. దీంతో ఎట్టకేలకు ఈ ఘటనపై యాపిల్ కంపెనీ యాజమాన్యం స్పందించింది. తమ స్టోర్లోకి వచ్చిన ఆరుగురు ఆఫ్రికా విద్యార్థులను బయటకు గెంటేసిన ఘటనపై ఆపిల్ సంస్థ క్షమాపణలు చెప్పింది.

తమ సిబ్బంది చేసిన పొరపాటుకు చింతిస్తున్నామని, ఈ విషయంలో క్షమించాలని కోరింది.  ప్రతి వినియోగదారుడు తమకు సమానమేనని పేర్కోంది. అయితే, స్టోర్ యాజమాన్యం క్షమాపణలు చెప్పిన తర్వాత తిరిగి ఆ విద్యార్థులు బుధవారం షాపింగ్ కు వెళ్లారు. ఇలా ఒక్క ఐ ఫోన్ స్టోర్లే కాదు.. వారు ఎక్కడికి వెళ్లినా దాదాపుగా తమ ఆఫ్రికన్లపట్ల జాతివివక్ష చూపిస్తారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Apple  Melbourne  Black People  Racism  

Other Articles