'Who is Amit Shah?' Angry BJP Lawmaker From Bihar Attacks Party Chief

Pm narendra modi amit shah in line of bjp mp s fire

Amit Shah, Bihar elections 2015, Bihar polls, Bhola Singh, PM Modi, Narendra Modi, Arun Shourie, LK Advani,Murli Manohar Joshi

Bhola Singh, a BJP parliamentarian from Bihar, has slammed Prime Minister Narendra Modi and BJP chief Amit Shah for the party's massive defeat in the assembly elections

ITEMVIDEOS: ప్రధాని, అమిత్ షాలపై మండిపడ్డ బీజేపీ సినీయర్ నేత

Posted: 11/12/2015 08:21 PM IST
Pm narendra modi amit shah in line of bjp mp s fire

ఒక్క గెలుపుతో అధికారం అందుకుంటే పర్వాలేదు కానీ అహంకారం వచ్చి చేరితేనే.. అబాసుపాలయ్యేది. ఇది రాజకీయ నేతలకు తెలియని విషయమే కాదు. అయినా తాజాగా జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిని చవిచూడటం బీజేపీకి అధినాయకత్వానికి శరాఘాతంలా పరిణమించింది. ఇప్పటికే బీహార్ ఎన్నిలకు ప్రధాని నరేంద్రమోడీనీ, బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను బాధ్యులను చేయడం సమంజసం కాదని ఓ వైపు బీజేపి సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు వివరణ ఇస్తున్న తరుణంలో.. అదే స్థాయిలో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

తాజాగా బీజేపీ సీనియర్ నేత, బెగుసరాయి ఎంపీ భోలా సింగ్ తమ పార్టీ అగ్రనాయకత్వంపై విరుచుకుపడ్డాడు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమితో ఇప్పటికే పలువురు పార్టీ సీనియర్ నేతలు ఓటమికి వివరణ ఇవ్వాలని కోరుతుండగా.. అదేబాటలో నడిచిన బోలా సింగ్ తన తీవ్రత స్థాయిని పెంచి మరీ సొంతపార్టీ జాతీయ అధ్యక్షుడిపైనే విమర్శలు గుప్పించాడు. 'అసలు అమిత్ షా ఎవరు? మేము అధికారాన్ని అప్పగిస్తే అమిత్ షా, ప్రధాని అక్కడ ఉన్నారు.  ఓటమికి అమిత్ షా వివరణ ఇవ్వాలి లేదా పార్టీ అధ్యక్ష పదవినుండి వైదోలగాలి' అని ఆయన డిమాండ్ చేశాడు.

రిజర్వేషన్లకు వ్యతికరేకంగా ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఫలితాలపై ప్రభావం చూపలేదన్న వివరణను భోలా సింగ్ ఖండించారు. భగవత్ వ్యాఖ్యలు బీజేపీ గెలుపు అవకాశాలపై వడగండ్ల వానలా పడ్డాయని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో మోదీ వ్యవహరించిన తీరును సైతం ఆయన విమర్శించారు. ఓ స్థానిక నేతలా లాలూ కుమార్తె, నితీష్ డీఎన్ఏపై వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రచారంలో అమిత్ షా చేసిన పాకిస్థాన్లో టపాసులు కాలుస్తారనే కామెంట్స్ సైతం పార్టీ ఓటమికి కారణమయ్యాయని బోలాసింగ్ ఆక్షేపించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amit Shah  Bihar elections 2015  Bihar polls  Bhola Singh  PM Modi  

Other Articles